నిర్మాత రెస్టారెంట్ కు నమ్రత ఫ్రీ పబ్లిసిటీ

0

ఇటీవలే మహేష్ సకుటుంబ సపరివార సమేతంగా ఓ రియల్ ఎస్టేట్ కంపెనీ వాణిజ్య ప్రకటనలో నటించిన సంగతి తెలిసిందే. ఈ ప్రకటనలో మహేష్-నమ్రతతో పాటు కిడ్స్ కూడా నటించారు. ఫ్యామిలీ అంతా ఆ ప్రకటనలో నటించడంతో మహేష్ ఫ్యాన్స్ లో హాట్ టాపిక్ అయ్యింది. అయితే అందుకోసం ఏకంగా రూ.5 కోట్ల ప్యాకేజీని అందుకోవడం పెద్ద డిబేట్ కి తెరతీసింది.

అయితే అలా కాదు కానీ.. ఈసారి సూపర్ స్టార్ వైఫ్ నమ్రత మాత్రం ఓ రెస్టారెంట్ కి ఉచితంగా పబ్లిసిటీ చేయడం హాట్ టాపిక్ గా మారింది. యాధృచ్ఛికమో లేక యథాలాపమో మొత్తానికి నమ్రత శిరోద్కర్ విజయవాడ హైవేలో ఉన్న `రాజుగారి తోట` రెస్టారెంట్ కి వెళ్లారు. ఆ రెస్టారెంట్ ఫుడ్ తిని అదుర్స్ అంటూ కితాబిచ్చేశారు. అది కాస్తా లక్షలాది మంది ఫాలోవర్స్ ఉన్న ఇన్ స్టాగ్రమ్ ఖాతాలో పోస్ట్ చేయడంతో ప్రస్తుతం జనంలో వైరల్ గా మారింది. రాజుగారి తోట రెస్టారెంట్ లో లంచ్ చేసిన నమ్రత .. మంచి ఆంధ్రా భోజనం తిన్నానని.. ఘుమఘుమలాడే తందూరీ చాయ్ తాగి చివరగా మీనాక్షి పాన్ లొట్టలేసుకుంటూ తిన్నానని తెలిపారు.

అసలింతకీ నమ్రత ప్రత్యేకించి ఆ రెస్టారెంట్ కే ఎందుకు ప్రచారం చేస్తున్నారు? అసలు అక్కడికే ఎందుకు వెళ్లారు? అంటే కారణమిదీ. ఇటీవలే నమ్రత శిరోద్కర్ ఏపీ సీఎం జగన్ సతీమణి అయిన శ్రీమతి భారతిని కలిసేందుకు హైవే జర్నీ చేసిన సంగతి తెలిసిందే. ఆ క్రమంలోనే మార్గం మధ్యలో ఉన్న రాజుగారి తోటలో రెస్టారెంట్ వద్ద లంచ్ కోసం దిగారు. అక్కడ భోజనం చేశాక మైమరిచి ఇలా పొగిడేశారు. అనంతరం భారతిని కలిసి మహేష్ దత్తగ్రామం బుర్రిపాలెం అభవృద్ధికి తాము చేసినది వెల్లడించి ప్రభుత్వ సాయం కోరారు. ఇక్కడో ఆసక్తికర విషయం ఏమంటే రాజుగారి తోటలో రెస్టారెంట్ ని అనీల్ సుంకర కొన్నాళ్ల క్రితం ప్రారంభించారు. దానికి అద్భుత స్పందన వచ్చింది. ప్రస్తుతం అనీల్ సుంకర బ్యానర్ లోనే మహేష్ సరిలేరు నీకెవ్వరు చిత్రంలో నటిస్తున్నారు. ఆ క్రమంలోనే తమ నిర్మాతకు ఇలా ఉచిత పబ్లిసిటీ చేసి పెట్టారు నమ్రత. ఇకపై నమ్రత పోస్టింగులు చదివేవాళ్లంతా హైవే జర్నీ చేస్తే తప్పనిసరిగా రాజుగారి తోటలో దిగిపోవడం గ్యారెంటీ. రెస్టారెంట్ కి ఈ ప్రచారం బాగానే కలిసొస్తోంది.
Please Read Disclaimer