సరిలేరుకి నమ్రత ప్రచారం పీక్స్

0

ప్రతి సోమవారం మాస్ ఎంబీ ట్రీట్ ఉంటుందని ప్రకటించిన మహేష్ టీమ్ అన్నంత పనీ చేస్తున్నారు. వారం వారం ఒక్కో పాటను రిలీజ్ చేస్తూ అంతకంతకు అభిమానుల్లో హీట్ పెంచేస్తున్నారు. ఇప్పటికే రెండు మూడు పాటలు వచ్చాయి. అభిమానుల్లోకి దూసుకెళ్లాయి.

ఈ సోమవారం సాయంత్రం 5:04 కి `హి ఈజ్ సోక్యూట్..` అంటూ రష్మిక ఇచ్చే ట్రీట్ కి అందరూ రెడీగా ఉన్నారు. సరిగ్గా ఈ పాట లాంచ్ గురించి ఫ్యాన్స్ కంటే నమ్రతనే ఎక్కువ టెన్షన్ గా ఉన్నట్టున్నారు. అందుకే 2గంటల ముందు రష్మిక- మహేష్ ఉన్న ఫోటోని షేర్ చేసి ఈ లిరికల్ వీడియో కోసం వేచి చూడాల్సిందిగా అభిమానుకు సూచించారు.

తాజాగా ఇన్ స్టాలో వరుస ఫోటోల్ని షేర్ చేస్తూ నమ్రత చేస్తున్న ప్రచారం వేడెక్కిస్తోంది. ఇంతకుముందు దర్శకనిర్మాతలు అనీల్ రావిపూడి- అనీల్ సుంకరలతో పాటు సంగీత దర్శకుడు దేవీశ్రీతో కలిసి దిగిన ఓ ఫోటోని నమ్రత షేర్ చేశారు. నమ్రత బ్లాక్ రెబాన్ ధరించి సంథింగ్ స్పెషల్ గా కనిపించారు ఆ ఫోటోలో.

“ఆసమ్ అనిపించే డైరెక్టర్ అనీల్ రావిపూడి… జీనియస్ మ్యూజిక్ మ్యాస్ట్రో దేవీశ్రీ…. ఫినామినల్ ప్రొడ్యూసర్ మిస్టర్ అనీల్ సుంకర… “ అంటూ టీమ్ లో ఒక్కొక్కరినీ విపరీతంగా పొగిడేశారు నమ్రత. బ్లాక్ బస్టర్ కి ఏమాత్రం తక్కువ కానంత కిక్కిస్తోందని నమ్రత ఆనందం వ్యక్తం చేశారు. ఊపిరి బిగబట్టి బిగ్ పిక్చర్ చూస్తారని ..నమ్రత అన్నారు. ఇక సో క్యూట్ అంటూ సాగే టీజింగ్ సాంగ్ కి రష్మికతో కలిసి డ్యాన్సులాడడం ఖాయమన్న ఆనందం వ్యక్తం చేశారు. ఇక అనీల్ సుంకర- దిల్ రాజులతో కలిసి GMB ఎంటర్ టైన్ మెంట్స్ (మహేష్ – నమ్రత) సంస్థ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. సంక్రాంతి కానుకగా జనవరి 11న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇప్పటికే రష్మిక సైతం తన సామాజిక మాధ్యమాల్లో ఓ రేంజులో ప్రమోషన్ చేస్తోంది. రష్మికతో పాటుగా నమ్రత ఇతర టీమ్ కూడా అదే రేంజులో సోషల్ మీడియా ప్రమోషన్ చేస్తుండడం ఆసక్తికరం.
Please Read Disclaimer