కొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన బాలయ్య.. బర్త్ డే వేడుకల్లో వరల్డ్ రికార్డ్

0

నందమూరి నటసింహం బాలకృష్ణ సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టారు. తన ఫాలోయింగ్ ఏంటనేది నిరూపిస్తూ ప్రపంచ రికార్డు సృష్టించారు. జూన్10 బాలకృష్ణ 60వ జన్మదినాన్ని పురస్కరించుకుని.. అనంతపురంకు చెందిన ఎన్‌బీకే హెల్పింగ్ హ్యాండ్స్ ప్రతినిధి జగన్ పర్యవేక్షణలో ప్రపంచవ్యాప్తంగా గ్లోబల్ నందమూరి ఫ్యాన్స్ ఆధ్వర్యంలో (డాక్ట‌ర్స్‌, పోలీస్‌, ఆరోగ్య సిబ్బంది, పారిశుద్ధ్య సిబ్బంది)కి సెల్యూట్ చేస్తూ ఉదయం10 గంటల10 నిమిషాలకు ఏకకాలంలో సుమారు 21 వేల కేకులను కట్ చేశారు. అయితే విశ్వవ్యాప్తంగా ఈ రేంజ్‌లో కేక్ కట్ చేయడం ఇదే మొదటిసారి అని తెలుపుతూ వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్, జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్స్ రికార్డు ప్రతినిధులు దీనిని వరల్డ్ రికార్డుగా ప్రకటించారు. పరిస్థితులు చక్కబడగానే బాలకృష్ణకు ప్రశంసాపత్రం అందజేస్తామని తెలిపారు.

ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ.. తన 60వ పుట్టినరోజుని ఇప్పటి పరిస్థితులకు అనుగుణంగా అభిమానులతో పాటు, మిత్రులు, శ్రేయోభిలాషులు క్రమశిక్షణతో జరుపుకోవడం సంతోషంగా ఉందని అన్నారు. ”మీ కుటుంబ సభ్యుల సమక్షంలో వేడుకలు జరిపి మీ సామాజిక బాధ్యతను నాకు అపూర్వకానుకగా ఇచ్చారు. మీ ప్రేమాభిమానాన్ని ప్రపంచ రికార్డు రూపంలో అందించిన మీ అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు” అని బాలకృష్ణ తెలిపారు. సామాజిక దూరం పాటించి సేవా కార్యక్రమలు చేసిన వారందరికీ, ఆర్గనైజ్ చేసిన అనంతపురం జగన్‌కి ఈ సందర్భంగా అభినందనలు తెలుపుతున్నానని బాలయ్య చెప్పారు.

ప్రస్తుతం బాలకృష్ణ తన కొత్త సినిమాను మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో చేస్తున్నారు. వీరిద్దరి కాంబోలో హాట్రిక్ మూవీగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవలే విడుదలైన ఈ మూవీ ‘ఫస్ట్ రోర్’ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.
Please Read Disclaimer