బాలయ్య అభిమానులు షాకయ్యే పాయింట్

0

నటసింహా నందమూరి బాలకృష్ణ గుండు తో ఉన్న ఫోటోలు ఇటీవల సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బోయపాటి శ్రీను సినిమా NBK 106 కోసం మేకోవర్ లో భాగంగా బాలయ్య గుండు గీయించుకున్నారని ప్రచారమైంది. ఆ న్యూ లుక్ తోనే ఏపీ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యారు. అదే సమయంలో నటి- వైకాపా ఎమ్మెల్యే రోజా బాలయ్య తో కలిసి సెల్పీ దిగడం హాట్ టాపిక్ అయ్యింది. మరి నిజంగా బోయపాటి సినిమా కోసమే బాలయ్య అలా మేకోవర్ ట్రై చేస్తున్నారా? లేక పర్మినెంట్ సోల్యుషన్ కోసం గుండు గీయించారా? అని ఆరా తీస్తే.. అభిమానులు షాకయ్యే వేరొక కొత్త పాయింట్ బయట పడింది.

బాలయ్య రూపం ఇకపై షాకిచ్చే లెవల్లో మారిపోనుందన్నది ఫిలింనగర్ వర్గాల గుసగుస. ముఖ్యంగా బాల్డ్ హెడ్ కు సంపూర్ణ పరిష్కారం కనిపెడుతున్నారట. వెంటనే హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ కు రెడీ అవుతున్నారని… వచ్చే నెలలో దుబాయ్ లో ఓ ప్రఖ్యాత ఆస్పత్రిలో ఖరీదైన చికిత్స చేయించుకోనున్నారని ప్రచారమవుతోంది. ఈ చికిత్స కోసం ఎన్.బీ.కే భారీగానే ఖర్చు చేస్తున్నారుట. అదే నిజమైతే హెయిర్ విగ్గులతో సమస్య ఇక తొలగినట్లే.

కొన్నేళ్లుగా బాలయ్య విగ్గులు పెట్టుకుని మ్యానేజ్ చేయాల్సొస్తోంది. ఒక్కోసారి ఆ విగ్గులు సెట్ అవుతున్నా యి.. మరికొన్నిసార్లు సరిగ్గా కుదరడం లేదు. ఇటీవల రూలర్ సినిమా కోసం వాడిన విగ్గుల వల్ల ఆయ తీవ్ర విమర్శలకు గురికావాల్సి వచ్చింది. ఆ సినిమా కోసం వాడిన ఏ విగ్గు సెట్ అవ్వలేదని ఓ రేంజ్ లో నెటిజనులు ట్రోల్ చేసారు. దీనికి తోడు ఆ సినిమాలో కమెరా మెన్ బాలయ్యను సరిగ్గా చూపించలేదని..అందువల్లే విగ్గు మరింత తేలిపోయిందని ఛాయాగ్రాహకుడిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇవన్నీ బాలయ్యను కాస్త ఇబ్బంది కి గురిచేసాయి.

అందుకే ఇక లాభం లేదని బావించి సంపూర్ణంగా సమస్యకు పరిష్కారం కావాలని భావించారట. బాలయ్య బాల్డ్ హెడ్ ఇక మాయమవుతుందన్న టాక్ ప్రస్తుతం ఆయన క్లోజ్ సోర్సెస్ ద్వారా రివీలవ్వడంతో అది కాస్తా అంతర్జాలంలో జోరుగా వైరల్ అయిపోతోంది. టాలీవుడ్ లో ఇప్పటికే చాలా మంది హీరోలు హెయిర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ చికిత్స శరీరతత్వాన్ని బట్టి కూడా మారుతూ ఉంటుంది. పర్మినెంట్ గా కుదిరేది కొందరికి మాత్రమే అయితే చాలా మందికి ఈ చికిత్స వికటించిన సందర్భాలు లేకపోలేదు.
Please Read Disclaimer