అడుగడుగో యాక్షన్‌ హీరో.. కార్పొరేట్‌ లీడర్‌గా బాలయ్య

0

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం రూలర్‌. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలు నిరాశపరచటంతో రూలర్‌తో అభిమానులను ఖుషీ చేయాలనుకుంటున్నాడు బాలయ్య. అందుకు తగ్గట్టుగా తమిళ దర్శకుడు కేఎస్‌ రవికుమార్‌ డైరెక్షన్‌లో ఓ పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో బాలయ్య సరసన సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా డిసెంబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ ఇటీవల టీజర్‌ను రిలీజ్‌ చేశారు. తాజాగా సినిమాలోని ఫస్ట్ లిరికల్‌ను రిలీజ్‌ చేశారు.

బాలయ్య స్టైలిష్ కార్పోరేట్‌ లుక్‌కు సంబంధించిన ఈ పాటకు మంచి రెస్పాన్స్‌ వస్తోంది. చిరంతన్‌ భట్ స్వరాలందించిన ఈ పాటకు రామజోగయ్య శాస్త్రి సాహిత్యమందించారు. సాయి చరణ్‌ భాస్కరుని ఆలపించారు. అడుగడుగో యాక్షన్‌ హీరో అంటూ సాగే ఈ పాట బాలయ్య అభిమానులకు ఇన్‌స్టాంట్‌గా నచ్చేలా ఉంది.

ఈ సినిమాలో బాలకృష్ణ రెండు డిఫరెంట్ లుక్స్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే టీజర్‌లో రెండు లుక్స్‌ను రివీల్‌ చేశారు. ఒక లుక్‌లో పవర్‌ ఫుల్‌ మాస్‌ పోలీస్‌ ఆఫీసర్‌గా కనిపిస్తుండగా మరో లుక్‌లో స్టైలిష్ కార్పోరేట్‌ బిజినెస్‌ మేన్‌గా కనిపిస్తున్నాడు.
Please Read Disclaimer