బాలకృష్ణ ‘రూలర్’ ట్రైలర్ : రెండు వేరియేషన్స్‌లో బాలయ్య.. ఫ్యాన్స్‌కు పూనకాలే

0

నందమూరి బాలకృష్ణ హీరోగా తెరకెక్కిన తాజా చిత్రం రూలర్‌. తమిళ దర్శకుడు కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రతీ ఏడాది సంక్రాంతి బరిలో సత్తా చాటే బాలయ్య ఈ సారి అభిమానులకు సంక్రాంతిని కాస్త ముందుగానే తీసుకువచ్చేందుకు రెడీ అవుతున్నాడు.

బాలయ్య మార్క్‌ మాస్‌ కమర్షియల్ ఫార్ములాతో రూపొందిన రూలర్‌ ట్రైలర్‌ ఆదివారం రిలీజ్‌ అయ్యింది. పక్కా కమర్షియల్‌ ఫార్మాట్‌లో రూపొందించిన ఈ ట్రైలర్‌లో బాలయ్య అభిమానులు ఏ ఏ అంశాలు ఆశిస్తారో అవన్ని పక్కాగా ఉండేలా ప్లాన్‌ చేశారు. బాలయ్య మార్క్‌ పంచ్‌ డైలాగ్‌లు హీరో ఎలివేషన్‌ యాక్షన్‌ ఏ మాత్రం తగ్గకుండా ప్లాన్ చేశారు చిత్రయూనిట్‌.

బాలకృష్ణ సరసన హాట్‌ బ్యూటీ సోనాల్‌ చౌహాన్‌, వేదికలు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాలో జయసుథ, భూమిక, ప్రకాష్‌ రాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఎన్టీఆర్‌ కథానాయకుడు, మహానాయకుడు సినిమాలతో నిరాశపరిచిన బాలయ్య రూలర్‌లో అభిమానులను అలరించాలని ప్లాన్‌ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా పర్ఫెక్ట్ ప్యాకేజ్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.

సీ కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమాకు కేయస్‌ రవికుమార్‌ దర్శకుడు. బాలయ్యతో గౌతమిపుత్ర శాతకర్ణి, జైసింహా సినిమాలకు పనిచేసిన సంగీత దర్శకుడు చిరంతన్‌ భట్‌ ఈ సినిమాకు కూడా సంగీతమందిస్తున్నాడు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా డిసెంబర్‌ 20 ప్రేక్షకుల ముందుకు రానుంది.
Please Read Disclaimer