నందమూరి హీరో సినిమాలో ఆమెదే కీ రోల్!

0

నందమూరి కళ్యాణ్ రామ్.. మెహ్రీన్ పీర్జాదా జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. గుజరాతి హిట్ ఫిలిం ‘ఆక్సిజెన్’ కు రీమేక్ గా ఈ సినిమా తెరకెక్కుతోంది. సంక్రాంతి సీజన్ లో భారీ పోటీ ఉన్నప్పటికీ ఈ సినిమాను బరిలో నిలపడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతోంది.

ఈ సినిమా గురించి తాజాగా ఒక ఇంట్రెస్టింగ్ విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో సీనియర్ నటి సుహాసిని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. నిజానికి ఈ సినిమా కథ అంతా సుహాసిని పాత్ర చుట్టూనే తిరుగుతుందట. చాలా రోజుల తర్వాత సుహాసిని టాలీవుడ్ లో ఇంత ప్రాముఖ్యత ఉన్న పాత్రను పోషిస్తున్నారని సమాచారం. అయితే ఈ విషయం ఇప్పటి వరకూ సీక్రెట్ గానే ఉంచారు. మరి ఈ మంచివాళ్ళు ఫుల్ గా ఉండే సినిమాలో సుహాసిని ఎంత మంచి పాత్ర ఇచ్చారో తెలియాలంటే మనం వేచి చూడకతప్పదు.

దర్శకుడు సతీష్ వేగేశ్న తొలి సినిమా ‘శతమానం భవతి’ సినిమాతోనే అటు కమర్షియల్ విజయాన్ని.. ఇటు విమర్శకుల ప్రశంసలను అందుకున్నారు. అయితే ఆ తర్వాత ఆయన తెరకెక్కించిన ‘శ్రీనివాస కళ్యాణం’ పూర్తిగా నిరాశపరిచింది. మరి ఈ సినిమాతో ఆయన ప్రేక్షకులను మెప్పిస్తారా.. నందమూరి హీరోకు ఒక భారీ విజయాన్ని అందిస్తారా అనేది వేచి చూడాలి.
Please Read Disclaimer