సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

ఏమంటిరి ఏమంటిరి.. మీ ఫ్లాపులకు రివ్యూలు కారణమా?

0

రివ్యూలు అనేవి ప్రస్తుతం తరంలో విడదీయలేని భాగం అయ్యాయి. అమెజాన్.. ఫ్లిప్ కార్ట్.. ఈబే ఏ ఈ-కామర్స్ సైట్ అయినా సరే.. వాటిలో ఒక వస్తువు కొనేముందు కస్టమర్లు ప్రోడక్ట్ రివ్యూస్ చూస్తారు. ఆన్ లైన్ షాపింగ్ ఒక్కటే ఏం ఖర్మ.. అన్నిటిలోనూ రివ్యూలే. ఇక సినిమాల రివ్యూలు కూడా చాలా ఫేమస్. అయితే వీటి పట్ల ఫిలిం ఇండస్ట్రీలో నెగెటివిటీ కూడా ఎక్కువే.

కారణం సింపుల్. వందలో పది సినిమాలే హిట్లు. అంటే పది సినిమాలకే పాజిటివ్ రివ్యూలు వస్తాయి. మిగతా సినిమాలకు బ్లాక్ బస్టర్లు అని ఇండస్ట్రీ హిట్లు అని రాస్తే సదరు రివ్యూల కింద ఉండే కామెంట్ సెక్షన్ లో సునామీ వస్తుంది. ఇలాంటి అవకాశం కోసమే కాచుకుని కూర్చున్న బూతు శాస్త్రవేత్తలు కొత్త కొత్త పదాలతో అరాచకం సృష్టిస్తారు. అయినా ఈ కష్టాలతో ఫిలిం మేకర్ల కు సంబంధం లేదు కదా. చాలామంది ఫిలిం మేకర్ల ఉద్దేశం ఎలా ఉంటుంది అంటే ఎంతో కష్టపడి తాము డబ్బా సినిమా తీసినప్పటికీ తమ సినిమాకు మంచి రివ్యూలే రావాలి. అలా వస్తే ఫుల్ హ్యపీస్. లేకపోతే రివ్యూ రైటర్లకు రివ్యూ చెయ్యడం తెలియదు.. అసలు రివ్యూల కారణంగా ఫిలిం ఇండస్ట్రీ సర్వనాశనం దుంపనాశనం అవుతుంది అన్నట్టుగా విరుచుకుపడతారు. అంతే కాని ముష్టి సినిమాలు తీసి టాలీవుడ్ పరువును మూసినదిలో కలుపుతున్నామని మాత్రం ఒప్పుకోరు.

ఈమధ్య మీడియం రేంజ్ హీరోలు.. నిర్మాతలు రివ్యూలపై పడి ఏడవడం కామన్ గా మారిపోయింది. వీళ్లు చెప్పేది ఏంటంటే ప్రేక్షకులకు తమ సినిమా తెగ నచ్చిందని.. ఎగబడి చూస్తున్నారని.. తమ పనులు మానుకుని మరీ రిపీటెడ్ గా సినిమా చూస్తున్నారని అంటారు. అయితే రివ్యూలు సరిగా ఇవ్వక పోవడంతో కలెక్షన్స్ తగ్గుతున్నాయని నిష్టూరాలు పోతున్నారు. అసలు వారి ఏడుపు లోనే సమాధానం ఉంది. ఒక సినిమా విజయానికి ఏది కొలమానం? నిస్సందేహంగా కలెక్షన్లే. మరి కలెక్షన్స్ లేకపోవడం.. కలెక్షన్స్ తగ్గడం దేన్ని సూచిస్తోంది.. సినిమా ప్రేక్షకులకు నచ్చలేదని కదా? మరి రివ్యూలపై పడి ఏడవడం ఎందుకు?

అయినా ఒక సూపర్ సినిమా కు రివ్యూ రైటర్లు అందరూ 1 రేటింగ్ ఇచ్చినప్పటికీ ఆ సినిమాను ఫ్లాప్ చెయ్యలేరు. ప్రేక్షకులు ఎలాగూ దాన్ని హిట్ చేస్తారు. ఒక చెత్త సినిమాకు 5 రేటింగ్ ఇచ్చినా ప్రేక్షకులేమీ దాన్ని తమ తలపై పెట్టుకుని ఊరేగరు. నిర్దాక్షిణ్యంగా తిరస్కరిస్తారు. ప్రేక్షకులు ఒక రివ్యూ చదివి నమ్మే రోజులు ఎప్పుడో పోయాయి. ఇదు సైట్లలో ఐదు రివ్యూలు చదివి.. పది మౌతుల టాక్ తెలుసుకుని మరీ సినిమా ను థియేటర్లో చూడాలా.. అమెజాన్ లో చూడాలా అనేది డిసైడ్ అవుతారు. థియేటర్ కు రప్పించి వారిని సినిమా చూసేలా చెయ్యాలంటే రివ్యూల పైన పడి ఏడవడం కాదు. మంచి కంటెంట్ తో ప్రేక్షకులను మెప్పించే సినిమాలు తీయడం ఒక్కటే శరణ్యం. అలా చేస్తే అందరికీ మంచిది. లేదూ సినిమా రిలీజ్ షో కు ముందే ఇండస్ట్రీ హిట్ అని పోస్టర్లు రెడీ చేసుకుంటాం అంటే ఇక ఎవ్వరూ ఏమీ చెయ్యలేరు.
Please Read Disclaimer