బిగ్ బాస్ బ్యూటీ నందిని రాయ్ అగ్గి మీద గుగ్గిలం

0

తెలుగు నాట బుల్లితెర వీక్షకులకు `బిగ్ బాస్` రియాలిటీ షో ఒక ఆటవిడుపుగా మారింది. ఈ షో ద్వారా పాపులారిటీ తెచ్చుకున్న మోడల్ కం నటి నందిని రాయ్. బిగ్ బాస్ సీజన్ 2లో తళతళ మెరుపులతో కుర్రాళ్ల గుండెల్లో చిచ్చు పెట్టింది. అయితే బిగ్ బాస్ కొందరికి ప్లస్సు కొందరికి మైనస్సు. ఈ మైనస్ కేటగిరీలోకి చేరిపోయింది ఈ అమ్మడు. సరైన ఛాన్సుల్లేక ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ కొత్త ప్రయత్నాల్లో ఉందిప్పుడు.

నందిని స్వగతంలోకి వెళితే.. 1990 సెప్టెంబరు 18న సికిందరాబాద్ లోని సింధీ కుటుంబంలో జన్మించింది. హైదరాబాద్ సెయింట్ ఆల్బన్స్ లో స్టడీస్ సాగించింది 2005లో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన నందిని – లండన్ లో ఫైనాన్స్ లో ఎం.బి.ఏ. డిగ్రీని పూర్తి చేసింది. 80కిపైగా జాతీయ అంతర్జాతీయ బ్రాండ్లకు మోడల్ గా నటించిన నందిని.. 2008లో మిస్ హైదరాబాద్ 2008.. 2010లో మిస్ ఆంధ్రప్రదేశ్.. 2009లో మిస్ పాంటలూన్స్ ఫ్రెష్ ఫేస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్.. 2010లో మిస్ బ్యూటిఫుల్ ఐస్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కిరీటాలు గెలుచుకుంది.

సినీ కెరీర్ పరిశీలిస్తే.. `ఫ్యామిలీ ప్యాక్` అనే హిందీ చిత్రంలో నటించింది. అటుపై మాయ- మోసగాళ్ళకు మోసగాడు అనే తెలుగు చిత్రాలలో నటించింది. 2012లో లాగిన్ అనే బాలీవుడ్ చిత్రంలో కూడా కనిపించింది. ఎ. సాజీద్ దర్శకత్వం వహించిన `గుడ్ బై డిసెంబర్` అనే చిత్రంతో మలయాళంలోకి ప్రవేశించింది. 2014లో ఫ్యాషన్ డిజైనర్ పాత్రలో `ఖుషి ఖుషి యాగి` అనే చిత్రంతో కన్నడంలోకి ప్రవేశించిన ఈ బ్యూటీ 2018లో గ్రహణం చిత్రంతో తమిళంలోకి ప్రవేశించింది. తెలుగులో సుడిగాడు సీక్వెల్ కథతో తెరకెక్కిన సిల్లీ ఫెలోస్ చిత్రంలోనూ ఆడిపాడింది. అయితే బిగ్ బాస్ 2 కలిసొస్తుంది అనుకుంటే అంతా రివర్స్ అయ్యింది. అవకాశాలు సరిగా లేకపోవడంతో ఇదిగో ఇలా ఫోటోషూట్లతో నెట్టుకొస్తోంది. లేటెస్ట్ ఫోటోషూట్ లో బ్లాక్ ఇన్ వోర్ తో మతి చెడగొడుతోంది. టాప్ టు బాటమ్ బ్లాక్ లో తళుక్కుమంది. ఆ పొడవాటి జడ.. కాటుక కళ్లతో ఆకర్షిస్తోంది. కనీసం ఈ ప్రయత్నం చూశాక అయినా మన దర్శకనిర్మాతలు అవకాశం ఇస్తారేమో చూడాలి.
Please Read Disclaimer