ట్రైలర్ టాక్ : ‘నగ్నం’

0

‘శివ’ లాంటి సినీ చరిత్రలో నిలిచిపోయే చిత్రాలను అందించిన రామ్ గోపాల్ వర్మ ప్రస్తుతం తన క్రియేటివిటీ 18ప్లస్ ఏజ్ ఉన్నవాళ్లు మాత్రమే చూసే సినిమాలపై పెడుతున్నాడు. ఈ క్రమంలో తాజాగా శృంగార తార మియా మాల్కోవాతో తెరకెక్కించిన ‘క్లైమాక్స్’ అనే చిత్రం ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. సినిమా ఎలా ఉన్నా 100 రూపాయలు టికెట్ రేట్ పెట్టి డబ్బులు మాత్రం బాగానే వసూలు చేసుకున్నాడు. దీనితో లేట్ చేయకుండా ఆర్జీవీ మరోసారి ప్రేక్షకుల వీక్ నెస్ ని వాడుకోడానికి సిద్ధం అయ్యాడు. ఈ క్రమంలో ‘నగ్నం’ అనే చిన్న సినిమాను ప్రకటించిన వర్మ అప్పుడే ట్రైలర్ ను కూడా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చాడు. నేను రాజమౌళి ని కాదు.. ఇది ‘RRR’ కాదు ఇది ‘NNN’ అంటూ ట్రైలర్ రిలీజ్ చేసాడు. ఇప్పుడు తాజాగా ‘నగ్నం’ సినిమా నుండి ట్రైలర్ 2 రిలీజ్ చేసాడు వర్మ.వర్మ ‘నగ్నం’ ట్రైలర్ 1 ని మించి ట్రైలర్ 2 ని చూపించాడు. ఈ ట్రైలర్ లో చూపించిన సన్నివేశాలు జనాలకు షాకిచ్చాయి. ఎక్కడెక్కడో కెమెరా పెడుతూ మ్యాజిక్ చేసిన ‘నగ్నం’ ట్రైలర్ బూతు కంటెంట్ కి కేరాఫ్ అడ్రస్ గా ఉంది. కాకపోతే ఆ టైపు సినిమాలను కోరుకునే వారిని ఈ ట్రైలర్ బాగానే ఆకర్షించింది. ‘క్లైమాక్స్’ కంటే మించి రెచ్చగొట్టేలా ఉన్న ఈ ‘నగ్నం’ ట్రైలర్ చూస్తే ఇంత వరకు ఏ డైరక్టర్ కూడా లేడీస్ పై ఈ యాంగిల్ లో కెమెరా పెట్టలేదని చెప్పవచ్చు. ఇక యువతి బాడీ పార్ట్స్ మీద ఫుల్ ఫోకస్ పెట్టిన వర్మ అలాంటి సన్నివేశాలకి బ్యాగ్రౌండ్ స్కోర్ గా శ్లోకాన్ని కూడా వాడాడు.

తెలుగు హిందీ ఇంగ్లీష్ వెర్షన్లలో ఈ మూవీ రిలీజ్ చేయబోతున్నారు. ‘క్లైమాక్స్’ సినిమాకు వంద రూపాయలు పెట్టిన వర్మ ఈసారి మాత్రం రెండు వందల రూపాయలను టికెట్ ధరగా నిర్ణయించాడు. ఈ ‘NNN’ కూడా ‘క్లైమాక్స్’ సినిమా మాదిరిగానే ఆర్జీవీ వరల్డ్ లో జూన్ 27న రాత్రి 9 గంటలకి రిలీజ్ కాబోతోందని ప్రకటించారు. మరి ఈ చిన్న సినిమాని 200 రూపాయలు పెట్టి ఎంతమంది చూస్తారో చూడాలి.
Please Read Disclaimer