నాని 2 మొదలైంది

0

యంగ్ హీరో నాని వరుస విజయాలతో దూసుకు పోతున్నాడు. జెర్సీ.. గ్యాంగ్ లీడర్ చిత్రాలతో నటుడిగా వైవిధ్యభరితంగా కనిపించడంతో పాటు హిట్ లను అందుకున్నాడు. ఈతరం హీరోలు ఒక వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తున్నారు. నాని కూడా నిర్మాతగా అవతారం ఎత్తిన విషయం తెల్సిందే. వాల్ పోస్టర్ అనే బ్యానర్ ను ప్రారంభించిన నాని ఇప్పటికే ‘అ’ అనే చిత్రాన్ని నిర్మించాడు. ఆ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది.

నిర్మాతగా రెండవ సినిమాను మొదలు పెట్టేందుకు చాలా సమయం తీసుకున్న నాని మరో మంచి కాన్సెప్ట్ తో ఎట్టకేలకు రెండవ సినిమాను మొదలు పెట్టాడు. విశ్వక్ సేన్ హీరోగా శైలేష్ దర్వకత్వంలో ‘హిట్’ అనే చిత్రాన్ని నిర్మించబోతున్నాడు. నేడు లాంచనంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ సినిమా విభిన్నమైన కాన్సెప్ట్ తో ఉంటుందని.. విశ్వక్ సేన్ అయితే తప్పకుండా న్యాయం చేస్తాడనే నమ్మకంతో ఈ సినిమాకు ఆయన్ను ఎంపిక చేసుకున్నట్లుగా నాని చెబుతున్నాడు. ఈ చిత్రంలో విశ్వక్ సేన్ కు జోడీగా రుహాని శర్మను హీరోయిన్ గా నటింపజేస్తున్నారు.

విశ్వక్ సేన్ హీరోగా మొదటి సినిమా ఫలక్ నుమాదాస్ తో మంచి పేరు దక్కించుకున్నాడు. ఆ సినిమా తర్వాత మంచి సబ్జెక్ట్ కోసం ఎదురు చూస్తున్న ఆయనకు హిట్ నచ్చి చేసేందుకు ముందుకు వచ్చాడట. నాని ఈ చిత్రంను నిర్మించడంతో పాటు మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తన 25వ సినిమాలో నటిస్తున్న విషయం తెల్సిందే. ‘వి’ టైటిల్ తో రూపొందుతున్న ఆ సినిమాలో నాని నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రను చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer