#నాని26.. ఇదేం టైటిల్

0

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 25వ చిత్రం ‘వి’ షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఆ సినిమాలో నాని నెగటివ్ టచ్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. ఇంకా ఆ విషయమై క్లారిటీ అయితే రాలేదు. ఇక నాని ఆ సినిమా తర్వాత చేయబోతున్న సినిమాపై ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. నిన్ను కోరి వంటి విభిన్నమైన సినిమాను తనకు ఇచ్చిన శివ నిర్వానతో నాని మరోసారి జత కట్టబోతున్నాడు. వీరిద్దరి కాంబోలో సినిమాకు ప్రీ ప్రొడక్షన్ వర్క్ చకచక జరుగుతోంది.

ఇటీవలే ఈ సినిమాకు సంబంధించిన ప్రకటన అధికారికంగా వచ్చిన విషయం తెల్సిందే. నానికి జోడీగా ఈ చిత్రంలో రీతూ వర్మ మరియు ఐశ్వర్య రాజేష్ లు నటించబోతున్నారు. ఇక ఈ సినిమా గోదావరి నేపథ్యంలో రూపొందబోతుందంటూ ఇటీవలే వార్తలు వచ్చాయి. ఆ వార్తలపై ఇంకా ఎలాంటి క్లారిటీ రాకుండానే ఈ సినిమా టైటిల్ అంటూ సినీ వర్గాల్లో మరియు సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. నాని 26 టైటిల్ ‘టక్ జగదీష్’ అంటూ అధికారిక ప్రకటన వచ్చేసింది.

సోషల్ మీడియాలో ఈ టైటిల్ అప్పుడే తెగ హడావుడి చేస్తుంది. ఈ టైటిల్ పై కొందరు పాజిటివ్ గా రెస్పాండ్ అవుతుంటే కొందరు మాత్రం ఇదేం టైటిల్ అన్నట్లుగా కామెంట్స్ చేస్తున్నారు. శివ నిర్వాన గత చిత్రాల టైటిల్స్ నిన్ను కోరి మరియు మజిలీలు ఎంత ఆకర్షనీయంగా ఉన్నాయి. మరి ఇదేంటి ఇలా ఉంది.. అసలు ఇది నిజమైనా టైటిల్ అయ్యి ఉంటుందా లేదంటే పుకార్లా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే చిత్ర యూనిట్ సభ్యులు ఫ్రీ లుక్ ను ఇప్పటికే విడుదల చేశారు. కనుక ఇదే ఫైనల్ టైటిల్.
Please Read Disclaimer