ధూమ్ మోడల్ లో నాని V?

0

న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి మోహనకృష్ణ దర్శకత్వంలో ‘V’ అనే చిత్రం లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో సుధీర్ బాబు హీరోగా నటిస్తుండగా.. నాని ఒక నెగెటివ్ టచ్ ఉండే పాత్రలో నటిస్తున్నాడని ఇప్పటికే వార్తలు వచ్చాయి. అయితే ఈ సినిమాలో నాని పూర్తిస్థాయి విలన్ గా నటిస్తున్నాడట. ఈ విషయం అధికారికమే.

మరి హీరోగా మంచి ఫామ్ లో ఉన్న నాని ఇలా విలన్ పాత్రలో ఎందుకు నటిస్తున్నాడని అడిగితే “ధూమ్ చూశారు కదా .. అందులో హీరోలేగా విలన్ గా చేస్తారు. ఇదీ అంతే” అంటున్నాడట. బాలీవుడ్ లో ‘ధూమ్’ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ. అందులో విలన్ పాత్రలకే ప్రాధాన్యం ఎక్కువ. కథ అంతా విలన్ చుట్టూనే తిరుగుతుంది. జాన్ అబ్రహం మొదటి భాగం లో.. హృతిక్ రోషన్ రెండవ భాగంలో.. ఆమిర్ ఖాన్ మూడవ భాగంలో విలన్లుగా నటించారు. నాని ఇప్పుడు ‘V’ సినిమాను ‘ధూమ్’ తో పోల్చాడు అంటే ఈ సినిమా కూడా అదేరకంగా ఫ్రాంచైజీ తరహాలో చేస్తారని అంటున్నారు. ఆ లెక్కన ‘V’ సీరీస్ లో సుధీర్ బాబు పర్మనెంట్ హీరోగా ఉంటాడు.. తర్వాత భాగాలకు నాని ప్లేస్ లో వేరే హీరోలు వస్తారన్నమాట. మరి ఇదంతా నిజంగా జరుగుతుందా లేదా అనేది వేచి చూడాలి. ఒకవేళ ఇదే నిజం అయితే ఇంద్రగంటి-దిల్ రాజు పెద్ద ప్లాన్ లో ఉన్నట్టే లెక్క.

ఈ సినిమా నాని కెరీర్ లో ల్యాండ్ మార్క్ 25 వ చిత్రం కావడం విశేషం. ‘V’ లో నివేద థామస్.. అదితి రావు హైదరీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. అమిత్ త్రివేది ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. దిల్ రాజు ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer