నాని అలా ఫెయిల్.. నాగార్జున ఇలా ఫెయిల్

0

తెలుగు బిగ్ బాస్ మొదటి సీజన్ కు హోస్ట్ గా ఎన్టీఆర్ వ్యవహరించారు. ఆయన అన్ని విధాలుగా ఆకట్టుకున్నాడు. కంటెస్టెంట్స్ ను మందలించడం.. వారితో ఎంటర్ టైన్ మెంట్ పండించడం.. ప్రేక్షకుల అటెన్షన్ ను పొందడంలో కూడా ఎన్టీఆర్ సక్సెస్ అయ్యాడు. అయితే కొన్ని కారణాల వల్ల ఎన్టీఆర్ ఒక్క సీజన్ కే పరిమితం అయ్యాడు. దాంతో రెండవ సీజన్ ను నాని మరియు మూడవ సీజన్ కు నాగార్జున హోస్టింగ్ చేశారు. మొదటి సీజన్ హోస్ట్ కు సోషల్ మీడియాలో మరియు ప్రేక్షకుల్లో వచ్చిన పేరు రెండవ మరియు మూడవ సీజన్ హోస్ట్ లకు రాలేదంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి.

రెండవ సీజన్ హోస్ట్ నానిపై ఎక్కువగా ఫెవరేటిజం ట్రోల్స్ సోషల్ మీడియాలో వచ్చేవి. ఇంట్లోని కొందరు సభ్యులను నాని వెనకేసుకు వస్తున్నాడంటూ అప్పుడు పదే పదే విమర్శలు ఎదుర్కొన్నాడు. కొన్ని సార్లు తప్పు చేయని ఇంటి సభ్యులను కూడా మందలించాడు అంటూ సోషల్ మీడియాలో నానిపై కామెంట్స్ వినిపించాయి. నాని హోస్ట్ గా ది బెస్ట్ ఇచ్చేందుకు ప్రయత్నించినా కూడా విమర్శలు వచ్చేవి వస్తూనే ఉండేవి. అందుకే సీజన్ 3 తనవల్ల కాదంటూ నాని చెప్పినట్లుగా సమాచారం.

నాని నో చెప్పడంతో ఎంతో మందిని సంప్రదించిన బిగ్ బాస్ షో నిర్వాహకులు నాగార్జునను కాస్త బలవంతం చేసి మరీ ఒప్పించినట్లుగా వార్తలు వచ్చాయి. సాదారణంగా హోస్టింగ్ చేసే వారు షోను రెగ్యులర్ గా ఫాలో అవ్వడంతో పాటు అన్ సీన్ విషయాలను కూడా తెలుసుకోవాలి. కాని నాగార్జున మాత్రం షో ఫాలో అవ్వడం లేదని.. ఆయన డైరెక్టర్లు ఎలా చెబితే అలా.. స్క్రిప్ట్ ప్రకారం షో ను నిర్వహించుకుంటూ వెళ్తున్నాడు అంటూ మొదటి నుండి కామెంట్స్ వినిపిస్తున్నాయి. షో నుండి ఎలిమినేట్ అయిన వారు పలువురు నాగార్జున గారు షో ను చూడకుండానే హోస్టింగ్ చేస్తున్నట్లుగా ఆరోపణలు చేశారు.

నాగార్జున షో చూస్తూ తన అభిప్రాయాలను మరియు డైరెక్టర్ చెప్పే విషయాలతో కలిపి హోస్టింగ్ చేస్తే బాగుండేది అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నాని ఫేవరెటిజం చూపడం వల్ల హెస్ట్ గా ఫెయిల్ అయితే నాగార్జున మాత్రం షో చూడకుండానే హోస్టింగ్ చేస్తుండటం వల్ల ఫెయిల్ అయ్యారు అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి. అయితే వీరిద్దరు కూడా మంచి హోస్టింగ్ తో అలరించారని వారి వారి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
Please Read Disclaimer