నాని-సుధీర్ V రిలీజ్ తేదీ

0

రిలీజ్ ప్లాన్ చాలా ఇంపార్టెంట్ గా మారింది. మంచి రిలీజ్ మంచి సక్సెస్ కి సాయమవుతోంది. రిలీజ్ విషయంలో ఏమాత్రం రాజీపడకుండా ఆలోచించే దిల్ రాజు ఇప్పటికే సంక్రాంతి బరిలో తన సినిమాల ప్లేస్ మెంట్ పై పక్కాగా ప్లాన్ చేశారు. సరిలేరు.. దర్బార్ (పంపిణీ).. ఎంత మంచి వాడవురా చిత్రాల్ని మూడు స్పెషల్ తేదీలు చూసుకుని రిలీజ్ ని ఫిక్స్ చేశారు. సంక్రాంతి సెలవుల్ని పక్కాగా కవర్ చేసేలా జనవరిలో పండగ ముందు తేదీల్ని లాక్ చేశారు.

అదంతా సరే.. సంక్రాంతి తర్వాత రిలీజ్ కి రావాల్సిన క్రేజీ మల్టీస్టారర్ V సన్నివేశమేమిటి? అంటే దానిపైనా క్లారిటీ వచ్చేసింది. నాని-సుధీర్ బాబు హీరోలుగా ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో నిర్మిస్తున్న వీ చిత్రాన్ని ఉగాది కానుకగా మార్చి 25న రిలీజ్ చేయనున్నామని ప్రకటించారు. ఆ మేరకు ఉగాది పండగకు థియేటర్ల పరంగా ప్లానింగ్ సాగనుంది.

సంక్రాంతి రిలీజ్ ల తర్వాత చాలా వరకూ టెన్షన్ తగ్గుతుంది. ఇక వీ గురించి సీరియస్ గా ఆలోచించే వీలుంటుంది. ప్రమోషన్స్ పరంగానూ పక్కాగా ప్లాన్ చేయొచ్చు. ఇక ఈ చిత్రం దొంగా పోలీస్ కథాంశంతో తెరకెక్కుతోందని ఇందులో నాని విలన్ గా నటిస్తుంటే.. సుధీర్ బాబు హీరోగా కనిపిస్తారని ప్రచారమవుతోంది. నివేధ థామస్- అథిదీ రావ్ హైదరీ కథానాయికలుగా నటిస్తున్నారు.
Please Read Disclaimer