కలర్ ఫొటోను రెండు సార్లు చూసిన నాని

0

సుహాస్ హీరోగా ఛాందిని చౌదరి హీరోయిన్ గా సందీప్ రాజ్ దర్శకుడిగా పరిచయం అయిన కలర్ ఫొటో ప్రస్తుతం ట్రెండ్డింగ్లో ఉంది. ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న కలర్ ఫొటోపై అందరు ప్రశంసలు కురిపిస్తున్నారు. ఒక సింపుల్ కథను ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా బ్యూటీ ఫుల్ గా తెరకెక్కించిన దర్శకుడు సందీప్ కు ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సినిమాను హృదయకాలేయం.. కొబ్బరిమట్ట సినిమాలను నిర్మించిన సాయి రాజేష్ నిర్మించాడు. ఈ సినిమాతో మరో విజయాన్ని ఆయన అందుకున్నాడు. ఈ సినిమా కథను సాయి రాజేష్ స్వయంగా రాసుకున్నాడు. దర్శకత్వ బాధ్యతలను సందీప్ కు అప్పగించాడు.

సినిమా విడుదలై పాజిటివ్ టాక్ దక్కించుకున్న నేపథ్యంలో దర్శకుడు సందీప్ మాట్లాడుతూ.. సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తే చాలా ఆనందంగా ఉంది. పలువురు నాకు కాల్ చేసి అభినందిస్తున్నారు. చాలా మంది సోషల్ మీడియా ద్వారా అభినందిస్తున్నారు. నాని గారు కాల్ చేసి సినిమా బాగా తీశావు అన్నారు. ఆయన సినిమాను రెండు సార్లు చూశాను అంటూ చెప్పడం నాకు చాలా సంతోషంగా అనిపించింది.

రాజమౌళి.. రవితేజ.. మారుతి.. సాయి ధరమ్ తేజ్ ఇలా పలువురు సోషల్ మీడియా ద్వారా సినిమాను అభినందిస్తూ పోస్టులు పెట్టారు. వారందరి ప్రశంసలు చాలా సంతోషాన్ని కలిగించాయి అన్నాడు. తన తదుపరి సినిమాను ఎస్ కే ఎన్ నిర్మాణంలో చేయబోతున్నట్లుగా దర్శకుడు సందీప్ పేర్కొన్నాడు. కలర్ ఫొటో సినిమా ఆహాలో ప్రస్తుతం అత్యధికులు చూస్తున్న సినిమాగా నిలిచిందంటూ సోషల్ మీడియా టాక్.