జెర్సీని వెంటాడుతున్న భీమిలి కనెక్షన్

0

టాలీవుడ్ లో చాలా కాలం తర్వాత వస్తున్న స్పోర్ట్స్ డ్రామాగా జెర్సి మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఒక క్రికెటర్ ఎమోషనల్ జర్నీగా రూపొందిన ఈ మూవీ గురించి ఇప్పటికే పలు రకాల కథనాలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా క్లైమాక్స్ ట్రాజెడీతో ఉంటుందని అందుకే స్పేర్ గా రెండు వెర్షన్లు షూట్ చేశారని ఇంకా టైం ఉంది కాబట్టి పలువురి అభిప్రాయాలు తీసుకుని ఫైనల్ లాక్ చేస్తారని ఇంతకు ముందే టాక్ వచ్చింది.

హీరో చనిపోతే సింపతీతో ప్రేక్షకులు కనెక్ట్ కావడం అనేది స్టార్ల విషయంలో చాలా అరుదుగా జరుగుతుంది. ఇమేజ్ లేని హీరోల పాత్రలు ఎలా ముగిసినా పెద్ద ప్రభావం ఉండదు కాని నాని లాంటి ఫాలోయింగ్ ఉన్నవాళ్ళకు ఇది ఎలా వర్క్ అవుట్ అవుతుంది అన్నది అనుమానమే

గతంలో భీమిలి కబడ్డీ జట్టులో ఇలాంటి ఎండింగ్ ట్రై చేసిన నాని దాన్నుంచి ఆశించిన ఫలితాన్ని అందుకోలేదు. అప్పుడు తనకు పెద్ద పేరూ లేదు. అప్ కమింగ్ ఆర్టిస్ట్ స్టేజిలో ఉన్నాడు. కాని ఇప్పుడు పరిస్థితి వేరు. గత ఏడాది కృష్ణార్జున యుద్ధం దేవదాస్ రెండూ నిరాశ పరిచిన నేపధ్యంలో జెర్సీ మీదే ఆశలన్నీ పెట్టుకున్నాడు.

మ్యూజిక్ పరంగా ఏవో అద్భుతాలు చేస్తాడనుకున్న అనిరుద్ రవిచందర్ జస్ట్ ఓకే అవుట్ పుట్ ఇచ్చాడని ఇప్పటికే టాక్ ఉంది. ఈ నేపధ్యంలో ఇలా క్లైమాక్స్ గురించి మ్యూజిక్ గురించి నాని ఫ్యాన్స్ టెన్షన్ పడటంలో అర్థం ఉంది. అయితే 19న ఇది విడుదలయ్యే దాకా ఏది చెప్పలేని పరిస్థితి.డిఫరెంట్ గా ట్రై చేసిన నాని ప్రయత్నం సక్సెస్ అయ్యిందో లేదా రిస్క్ గా మిగిలిపోయిందో తేలాలంటే ఇంకో పాతిక రోజులు వేచి చూడక తప్పదు
Please Read Disclaimer