2020లో ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో…నాని

0

టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ లిస్ట్ లో టాప్ టూ లో ఉండే పేరు రానా దగ్గుబాటి. మూడు పదుల వయసు దాటి చాలా ఏళ్లు అవుతున్నా ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోవడం లేదంటూ ఎక్కడికి వెళ్లినా ప్రశ్నిస్తూనే ఉంటారు. టాలీవుడ్ హీరోల పెళ్లి అనే ప్రస్థావన వస్తే ఫస్ట్ రానా పేరు గుర్తుకు రావాల్సిందే. అయితే ఇక నుంచి రానాకు ఆ తలనొప్పి తగ్గిపోనుంది. ఎందుకంటే తన ప్రేమను ప్రేయసి అంగీకరించనట్టు భల్లాలదేవుడు ప్రకటించాడు. త్వరలోనే పెళ్లి పీఠలు ఎక్కేందుకు సిద్దమయ్యాడు. తన బ్యాచిలర్ జీవితానికి త్వరలోనే ముగింపు పలకబోతున్నాడు. మిహీకా బజాజ్ అనే యువతితో ప్రేమలో ఉన్నట్లు రానా సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు. మిహీకా బజాజ్ హైదరాబాద్ కి చెందిన యువతి. ముంబైలో డ్యూ డ్రాప్ పేరిట ఈవెంట్ మేనేజ్మెంట్ కంపెనీని నిర్వహిస్తున్నారు. లండన్ ఆర్ట్స్ యూనివర్శిటీలో ఇంటీరియల్ రిజైన్ మాస్టర్ డిగ్రీ పూర్తి చేసింది. 2017లో ఆమె ‘డ్యూ డ్రాప్ డిజైన్’ అనే ఈవెంట్ కంపెనీని సొంతంగా రన్ చేసి యంగ్ బిజినెస్ ఉమెన్ గా మారింది. కాగా రానా ఆమెతో కలిసి దిగిన ఫోటోను షేర్ చేసి.. ఆమె యస్ చెప్పిన విషయాన్ని తన అభిమానులతో పంచుకున్నారు.

ఈ క్రమంలో టాలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు రానాకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. చిరంజీవి రామ్ చరణ్ మంచు మనోజ్ రాజమౌళి సమంత కాజల్’ అనుష్క శృతి హాసన్ హరీష్ శంకర్ సాయి ధరమ్ తేజ్ వరుణ్ తేజ్ అల్లు అర్జున్ క్రిష్ శోభు యార్లగడ్డ నితిన్ నిఖిల్ ఇలా సెలెబ్రిటీలంతా స్పందించారు. అయితే హీరో నాని మాత్రం కొంచెం ఫన్నీగా వెరైటీ పోస్ట్ పెట్టాడు. ‘ఇంకా ఏమేమి చూడాల్సి వస్తుందో 2020 లో’ అని సరదాగా పేర్కొంటూ బజాజ్ కంపెనీకి సంబంధించిన ‘హమారా బజాజ్’ అంటూ సాగే ఓ పాత యాడ్ వీడియోను జతచేసి.. ‘జోక్స్ పక్కకు పెడితే సూపర్ బాబాయ్’ అంటూ ట్వీట్ చేశాడు. రానా పెళ్లాడబోతున్న అమ్మాయి పేరు ‘మిహీకా బజాజ్’ కావడాన్ని దృష్టిలో పెట్టుకుని నాని ఆ యాడ్ కి సంబంధించిన వీడియో షేర్ చేయడం విశేషం. అంతేకాకుండా సందర్భోచితంగా 2020లో ఇంకేమి చూడాలో అంటూ వ్యంగ్యంతో కూడిన శుభాకాంక్షలను రానాకు తెలియజేశాడు. ఎందుకంటే 2020కి చరిత్రలో నిలిచిపోతుంది. కరోనా మహమ్మారి వచ్చి ప్రపంచాన్ని అతలాకుతం చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎన్నో వింతలు విశేషాలు చోటు చేసుకుంటున్నాయి. అందుకే నాని ఫన్నీగా ట్వీట్ చేసాడు. అంతేకాకుండా 2020లోనే నితిన్ నిఖిల్ పెళ్లిళ్లకు సిద్ధమయ్యారు. 50 ఏళ్ళ దిల్ రాజు 30 ఏళ్ళ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఇలాంటివి అన్ని దృష్టిలో పెట్టుకొని హీరో నాని వ్యంగ్యంతో ట్వీట్ చేసినట్లు అనిపిస్తోంది.Please Read Disclaimer


మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home