వరుణ్ తేజ్- నానీ క్లాష్.. ఇదీ క్లారిటీ!

0

ఒక పెద్ద సినిమా రిలీజ్ వాయిదా పడితే ఆ మేరకు ఇతర రిలీజ్ లకు సందిగ్ధత ఊహించని విధంగా ఉంటుంది. ఇటీవలే ప్రభాస్ `సాహో`ని ఆగస్టు 15 నుంచి 30 కి వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఆ వాయిదా పలు సినిమాల రిలీజ్ లను ప్రభావితం చేస్తోంది. ఆగస్టు 30 నాటికి రిలీజ్ ప్లాన్ చేస్కున్న వేరే సినిమాలకు ఇబ్బంది తప్పలేదు. సాహో తాకిడి బాక్సాఫీస్ వద్ద స్పష్టంగా ఉంటుంది కాబట్టి ఆగస్టు 30 కి రావాల్సిన నాని `గ్యాంగ్ లీడర్` సందిగ్ధంలో పడింది.

ప్రభాస్ సినిమాకి చోటిచ్చి ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేయాలి? అన్న డైలమా కొనసాగుతోందట. గ్యాంగ్ లీడర్ ని సెప్టెంబర్ రెండో వారంలో రిలీజ్ చేయాలని భావిస్తున్నారట. అయితే సాహో వాయిదా వల్ల సెప్టెంబర్ మొదటి వారంలో రావాల్సిన వరుణ్ తేజ్ `వాల్మీకి` రెండో వారానికి జరిగింది. దీంతో నాని- వరుణ్ తేజ్ సినిమాల మధ్య క్లాష్ తప్పడం లేదట. రెండు సినిమాలు ఒకేరోజు రిలీజైతే ఆ మేరకు పోటీ తప్పదు. అలా చేయడం కంటే రెండు డిఫరెంట్ తేదీల్ని లాక్ చేస్తేనే మంచిదని ఆ ఇద్దరూ భావిస్తున్నారట. వాల్మీకి సెప్టెంబర్ 13 తేదీన లాక్ అయ్యింది కాబట్టి `గ్యాంగ్ లీడర్` నే సెప్టెంబర్ మూడో వారం లేదా నాలుగో వారంలో రిలీజ్ చేస్తే మంచిదని భావిస్తున్నారు. సెప్టెంబర్ 20 లేదా 27న రిలీజైతే బావుంటుందని ఆలోచిస్తున్నారట.

ఒకవేళ ఆ తేదీల్లో ఏదో ఒకటి లాక్ చేయకపోతే అక్టోబర్ 2న మెగాస్టార్ `సైరా-నరసింహారెడ్డి` క్యూలో ఉంది. ఆ భారీ సినిమాతో పోటీపడాల్సి ఉంటుంది. అది కూడా సేఫ్ కాదు. కచ్ఛితంగా సెప్టెంబర్ చివరిలో వచ్చేస్తే సైరాతో వారం గ్యాప్ మెయింటెయిన్ చేయొచ్చు. అది సోలో వసూళ్లకు కలిసొస్తుంది. అటుపైనా అక్టోబర్ లో దసరా సెలవులు కలిసొస్తాయి కాబట్టి అలా ఆలోచిస్తేనే కరెక్ట్ అని నాని టీమ్ భావిస్తోందట. అంటే వాల్మీకి (హరీష్ శంకర్ దర్శకుడు) సెప్టెంబర్ 13న.. గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 20 లేదా 27 ఖాయం చేయొచ్చన్న ముచ్చట సాగుతోంది. సాహోకి సైరాకి మధ్య నెలరోజుల గ్యాప్ ఉంది కాబట్టి ఆ మధ్యలోనే వేరే సినిమాల్ని ప్లాన్ చేస్తున్నారన్నమాట.
Please Read Disclaimer