మెగా టైటిల్ తో రెండు సినిమాలు!

0

టాలీవుడ్ లో టైటిల్స్ వివాదాలు చాలానే జరిగాయి. మహేష్ బాబు ‘ఖలేజా’ – కళ్యాణ్ రామ్ ‘కత్తి’ ఈ కోవలోకే వస్తాయి. అప్పట్లో ఈ రెండు సినిమా టైటిల్స్ వివాదం గట్టి చర్చే జరిగింది. అయితే ఆ టైటిల్స్ కి ముందు తమ పేర్లు పెట్టేసుకొని ఏదో క్లియర్ చేసుకున్నారు. అయితే ఇప్పుడు నాని సినిమాకు కూడా ఇదే జరిగింది. నాని లేటెస్ట్ సినిమాకు ‘గ్యాంగ్ లీడర్’ అనే టైటిల్ పెట్టి ప్రమోషన్స్ మొదలెట్టారు. అయితే ఆ టైటిల్ తమదంటూ మరో సినిమా టీమ్ ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పుకున్నారు.

టైటిల్ వివాదంపై నాని తనకేం తెలియదని మాదాక ఎలాంటి కంప్లైంట్ రాలేదని చెప్పాడు. కట్ చేస్తే ఇప్పుడు నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’ కి ముందు నాని స్ అని యాడ్ చేశారు మేకర్స్. ఒక వైపు నాని సినిమా ప్రమోషన్స్ జరుగుతుండగా మరో వైపు ‘గ్యాంగ్ లీడర్’ (రచ్చ మళ్లీ మొదలైంది) సినిమా టీమ్ కూడా ప్రమోట్ చేసుకుంటున్నారు. రవి కిషోర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మోహన కృష్ణ హీరోగా నటించాడు.

నిజానికి అప్పట్లో మెగా స్టార్ కొన్ని పవర్ ఫుల్ టైటిల్స్ తో సినిమాలు చేసి హిట్లు కొట్టాడు. ఆ టైటిల్స్ ఇప్పటికే క్రేజే. అందులో ‘గ్యాంగ్ లీడర్’ ఒకటి. అదే ఇప్పుడు ఈ రెండు సినిమాలకు చిక్కు తెచ్చిపెట్టింది. ఇక మెగా స్టార్ టైటిల్ అందుబాటులో ఉంది కదా అని రెండు సినిమాలకి ఒకరికి తెలియకుండా మరొకరి ఒకే టైటిల్ పెట్టేసుకున్నారు. ఏదేమైనా టైటిల్ వివాదం అయితే ముగిసింది కానీ ఒకే టైటిల్ తో వస్తున్న ఈ సినిమాలతో ఆడియన్స్ మాత్రం కన్ఫ్యూజ్ అవుతున్నారు.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home