హోయ్నా..హోయ్నా..అనిరుధ్ మార్క్

0

నేచురల్ స్టార్ నాని నటిస్తున్న తాజా చిత్రం `నానీస్ గ్యాంగ్ లీడర్`. మనం ఫేం విక్రమ్ కె.కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి సంస్థ నిర్మిస్తోంది. ఈ సినిమాని సెప్టెంబర్ 13న రిలీజ్ చేస్తున్నారు. ఆ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. రిలీజ్ కి మరో నాలుగు వారాల సమయం మిగిలి ఉంది. అందుకే చిత్రయూనిట్ ప్రచారంలో వేగం పెంచింది. ప్రీ లుక్.. ఫస్ట్లుక్.. టీజర్కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ చిత్రంలోని రారా.. జగతిని జయించుదాం.. అంటూ సాగే మొదటి పాటకు మంచి రెస్పాన్స్ వస్తోంది. తాజాగా హోయ్ నా అంటూ సాగే పాటను చిత్రబృందం రిలీజ్ చేసింది.

ఈ రెండో పాటను స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల చేశారు. ట్యూన్ కంపోజ్ చేసి కార్ లో వెళుతున్న అనిరుధ్ .. ఆ పాటను హమ్ చేస్తుంటే.. వేరొక కార్ లో ప్రయాణిస్తున్న నాని స్పీకర్స్ లో ఆ పాటను ఆస్వాధిస్తుంటారు. ఇదీ కాన్సెప్ట్. ఈ ప్రచార గీతం ఆకట్టుకుంది. నానీస్ గ్యాంగ్ లీడర్ అన్న టైటిల్ కి తగ్గట్టే ఫన్ ఎంటర్ టైన్ మెంట్ కాన్సెప్టుతో విక్రమ్ కె ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో ఒక ప్రధాన పాత్ర ఆర్ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ పోషిస్తున్నారు. ప్రియాంక- లక్ష్మీ- శరణ్య- అనీష్ కురువిళ్లా- ప్రియదర్శి- రఘుబాబు- వెన్నెల కిశోర్- జైజా- సత్య తదితరులు ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.

మిరోస్లా కుబా బ్రోజెక్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. మనం.. 24 లాంటి క్లాసిక్స్ ని తెరకెక్కించిన విక్రమ్ కె పై అంచనాలున్నాయి. అయితే అతడు తెరకెక్కించిన `హలో` ఫ్లాపవ్వడం నిరాశపరిచింది. బన్నితో ఛాన్స్ మిస్సయినా నేచురల్ స్టార్ దొరకడం విక్రమ్ లక్ అనే చెప్పాలి. నానీ లాంటి ఎంటర్ టైనింగ్ స్టార్ తో విక్రమ్.కె చేస్తున్న ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితం అందుకోనుందో వేచి చూడాల్సిందే.
Please Read Disclaimer