సైలెంటుగా మరో ముహూర్తానికి నాని రెడీ

0

నేచురల్ స్టార్ నాని నటించిన `గ్యాంగ్లీడర్` ఆశించిన ఫలితాన్ని అందించని విషయం తెలిసిందే. దీంతో కెరీర్ పరంగా నాని ముందు కంటే ఎక్కువ జాగ్రత్త తీసుకుంటున్నాడట. విక్రమ్ కె అంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ తోనే సినిమా రిజెక్ట్ అయ్యిందంటే చాలానే ఆలోచించాడట. అందుకే ప్రస్తుతం చేస్తున్న సినిమా `వీ`పైనా చాలా జాగ్రత్తగా వున్నాడట. మోహనకృష్ణ ఇంద్రగంటి రూపొందిస్తున్న ఈ సినిమాలో నాని నెగెటివ్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు. కాప్ పాత్రలో సుధీర్ బాబు నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో వుంది. దీనితో పాటు నేచురల్ స్టార్ కొత్తకథలకు ఓకే చెబుతున్నాడు. కొత్తతరానికి అవకాశాలిస్తున్నాడని ఇదివరకూ ప్రచారమైంది. తాజాగా మరో సినిమా గురించి క్లారిటీ వచ్చేసింది.

`మజిలీ` చిత్రంతో ప్రశంసలందుకున్న యవ దర్శకుడు శివ నిర్వాణ త్వరలో తన కొత్త ప్రాజెక్ట్ ని మొదలుపెట్టడానికి రెడీ అవుతున్నాడు. ఈ చిత్రంలో నాని హీరోగా నటించే అవకాశం వుందిని తాజా న్యూస్. నాని – శివ నిర్వాణ కాంబినేషన్ లో ఇంతకుముందు నిన్ను కోరి రిలీజై ఆకట్టుకున్న సంగతి తెలిసిందే. శివను పరిచయం చేసింది నానీనే. ఆ క్రమంలోనే ఇది రెండో ప్రాజెక్ట్ అతడితో. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం స్క్రిప్ట్ లాక్ చేసి దర్శకుడు శివ నిర్వాణకు నాని గ్రీన్సిగ్నల్ ఇచ్చాడని ప్రచారం జరుగుతోంది.

అంతేకాదు… ఈ చిత్రం డిసెంబర్ 1న ఈ సినిమా ఫార్మల్గా ముహూర్తం జరుపుకోబోతోందిట. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు కూడా పూర్తియినట్లు తెలిసింది. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జెట్ స్పీడుతో జరుగుతున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి- హరీష్ పెద్ది ఈ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు నేడో రేపో రివీల్ చేయనున్నారట.
Please Read Disclaimer