లీడర్ నాని ఇలా ఉన్నాడేంటి?

0

జెర్సీ ఇచ్చిన సూపర్ కిక్ తో న్యాచురల్ స్టార్ నాని వచ్చే నెల గ్యాంగ్ లీడర్ గా రాబోతున్నాడు. ఇవాళ నుంచి ప్రమోషన్ ప్రారంభించబోతున్నారు. ఏ విశేషాలు చెబుతారా అని ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. నాని కూడా చిన్న వీడియో రిలీజ్ చేయడం వాళ్లకు ఉత్సాహాన్ని ఇచ్చింది. ఇకపై సుమారు రెండు నెలలు గ్యాంగ్ లీడర్ కు సంబంధించిన హంగామానే ఉండబోతోంది. అయితే నాని డైటింగ్ చేశాడో లేక జిమ్ ని స్ట్రిక్ట్ గా ఫాలో అయ్యాడో తెలియదు కానీ బాగా సన్నబడటం ఇప్పుడు హైలైట్ అవుతోంది.

ఇప్పటికే గ్యాంగ్ లీడర్ టైటిల్ ని వాడుకోవడం పట్ల మెగా ఫాన్స్ కినుకగా ఉన్నారు. చిరంజీవి కెరీర్లోనే ఒక మైల్ స్టోన్ మూవీగా నిలిచిపోయిన టైటిల్ పెట్టుకున్నప్పుడు హీరో పాత్ర కానీ బాడీ లాంగ్వేజ్ కానీ దానికి తగ్గట్టు మ్యాన్లీగా ఉండాలి. కానీ సన్నబడిన నానిలో ఆ గ్రేస్ తగ్గింది. ఒకరకంగా చెప్పాలంటే నాని న్యాచురల్ గానే బాగుంటాడు. ఇలా మాత్రం కాదని ప్రేక్షకుల అభిప్రాయం. సో గ్యాంగ్ లీడర్ లో స్టోరీ ఏమైనా డిమాండ్ చేసి ఇలా అయ్యాడా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. లేదూ ఇంద్రగంటి మోహనకృష్ణ వి సినిమా కోసం ఇలా మారాడా అంటే దానికి ఇంకా టైం ఉంది.

ఆలోగా గ్యాంగ్ లీడర్ బాలన్స్ పార్ట్ పూర్తి చేయాలి. సో ఇప్పుడీ లుక్ దీని కోసమే. గ్యాంగ్ లీడర్ అనగానే గుర్తుకువచ్చేవి చిరు మాస్ అవతారం మేచో మ్యాన్ అనిపించే బాడీ రఫ్ ఆడిస్తా అనే మ్యానరిజం. ఆ స్థాయిలో కాకపోయినా టైటిల్ కున్న వేల్యూని నిలబెట్టేలా నాని చేస్తే చాలు. మెగా ఫ్యాన్స్ సర్దుకుంటారు. దీని గురించి ఇంకాస్త క్లారిటీ రావాలంటే టీజరో ట్రైలరో వస్తే కానీ చెప్పలేం. దానికి సంబంధించిన వివరాలు కూడా ఇవాళే ప్రకటించే అవకాశం ఉంది
Please Read Disclaimer