నారి నారి నడుమ నాని

0

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం ఇంద్రగంటి దర్శకత్వంలో `వీ` అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత శివ నిర్వాణ దర్శకత్వంలో మరో సినిమాకి సన్నాహాలు చేస్తున్నాడు. ఇప్పటికే ప్రీప్రొడక్షన్ సాగుతోంది. నిన్ను కోరి తర్వాత నాని – శివ జోడీ మరో ప్రామిస్సింగ్ స్క్రిప్టుతో సెట్స్ పైకి వెళ్లబోతున్నారు.

ఈ సినిమా కథాంశం పచ్చని పల్లెటూరు నేపథ్యంలో ఆద్యంతం రక్తి కట్టిస్తుందట. ఇందులో నాని సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారు. ఇప్పటికే పెళ్లి చూపులు ఫేం రీతు వర్మను ప్రధాన కథానాయికగా ఎంపిక చేశారు. ఇక రెండో నాయికగా `కౌశల్య కృష్ణమూర్తి` ఫేం ఐశ్వర్య రాజేష్ ని ఎంపిక చేశారని తెలుస్తోంది. ఐశ్వర్య ఇందులో నానీకి మరదలు పాత్రలో కనిపిస్తుందట. క్రికెటర్ కౌశల్యగా తన నటనను ఇటీవలే థియేటర్లలో వీక్షించిన తెలుగు ఆడియెన్ మరోసారి తన నుంచి ప్రామిస్సింగ్ పెర్ఫామెన్స్ ఆశించవచ్చట.

నటించేది రెండో లీడ్ అయినా ఐశ్వర్యకు నటన పరంగా స్కోప్ ఉందట. పల్లెటూరమ్మాయిగా నాని మరదలుగా ఐశ్వర్య రాజేష్ కనిపించనుందని తెలుస్తోంది. ఇక ఇందులో మెయిన్ లీడ్ చేస్తున్న రీతూ ఇంతకుముందు నాని తో కలిసి `ఎవడే సుబ్రమణ్యం` చిత్రంలో కనిపించింది. రీతూ ఎంపిక ఓకే అయినా ఐశ్వర్య రాజేష్ ఎంపిక గురించి చిత్రబృందం అధికారికంగా ప్రకటించాల్సి ఉందింకా. నాయికల ఎంపికను బట్టి ప్రేయసికి.. మరదలికి మధ్య నలిగే మురారిలా నాని పాత్ర ఆకట్టుకుంటుందని భావించవచ్చు. ఇక ఈ మూవీలో ఇతరత్రా కాస్టింగ్ సంగతుల్ని దర్శకనిర్మాతలు వెల్లడించాల్సి ఉంది. అలాగే.. ఎంపిక చేసుకున్న కథాంశం ప్రకారం.. గోదారి పల్లెల్లో ఈ సినిమాని తెరకెక్కించాలని దర్శకనిర్మాతలు శివ- సాహో గరికపాటి ప్లాన్ చేస్తున్నారట.
Please Read Disclaimer