తెల్ల జుట్టు వచ్చేసిందిరో.. నాని టెన్షన్

0

వెటరన్ హీరోల ఏజ్ గేజ్ పై మీడియా లో మునుపెన్నడూ లేనంతగా కామెంట్లు పోటెత్తుతున్నాయ్. వయసు అయిపోయినా ఇంకా జనాలపై రుద్దేస్తున్నారన్న కామెంట్లు వేడెక్కిస్తున్నాయి. లేటు వయసులోనూ స్పైక్స్ దువ్వుతూ ఏమిటీ కామెడీ వేషాలు అంటూ ఘాటుగానే విమర్శిస్తున్నారు. తమిళంలో జుట్టు పండిపోయిన తళా తన ఒరిజినాలిటీని చెక్కు చెదరకుండా చూపిస్తూనే తన బాడీ లాంగ్వేజ్ కి తగ్గ పాత్రల్ని ఎంచుకుని సక్సెస్ అందుకుంటున్నాడు. యాప్ట్ క్యారెక్టర్ల తో తళా తెల్ల జుట్టునే ట్రెండీగా ప్రయోగించాడు.

అయితే మన హీరోలు మాత్రం ఇంకా నవమన్మధ వేషాలు వేయడంపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయసుడిగిన హీరోలు డిగ్నిఫైడ్ పాత్రల్లో నటించాలన్న కామెంట్ల తో నెటిజనులు బోలెడంత కామెడీలు చేస్తున్నారు. అదంతా సరే కానీ.. నేచురల్ స్టార్ నానీ ఈ కొత్త బెంగ చూశారా? అతడు సోషల్ మీడియాలో ఓ ఫోటోని పోస్ట్ చేసి `తెల్ల జుట్టు వచ్చేస్తోందిరోయ్..` అంటూ టెన్షన్ పడ్డాడు.

ఈ ఫోటో చూశాక.. నాని పని అప్పుడే అయిపోయిందా? అంటూ సరదా వ్యాఖ్యలు చేస్తున్నారు ఫ్యాన్స్. అయనా తెల్ల జుట్టు వచ్చేస్తే తళా అవ్వాలి కానీ.. ఇలా కళ్లు తేలేస్తే ఎలా నానీ? అని కొందరు సూచిస్తున్నారు. తెల్ల జుట్టుతోనూ బోలెడంత మ్యాజిక్ చేయొచ్చని నిరూపించిన ఎందరినో స్ఫూర్తిగా తీసుకోవాలి నానీ అనేస్తున్నారు. జెర్సీ .. గ్యాంగ్ లీడర్ చిత్రాలతో ఆశించినది ఏదీ దక్కలేదు. ఇక కొత్త సంవత్సరం లో అడుగు పెట్టేస్తున్నాడు. 2020లో నానీ నటిస్తున్న పలు క్రేజీ చిత్రాలు రిలీజ్ కానున్నాయి. ఇంద్రగంటి `వీ`లో నాని నెగెటివ్ షేడ్ ఉన్న పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. దీంతో పాటే నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ తో `టక్ జగదీశ్` అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా కోసం నాని కోరమీసంతో పాటు.. గుబురుగడ్డం పెంచుతున్నాడట. మెలితిరిగిన మీసం తో తళానే తలపిస్తాడట మరి. అయితే తలలో ఓ వెంట్రుక పండితేనే కంగారు పడుతున్న నానీ మొత్తం పండితే ఇంకెంత టెన్షన్ పడతాడో. అయినా అలా టన్షన్ పడాల్సిన పని లేకుండా తళాని ఫాలో అయిపోతే పోలా!
Please Read Disclaimer