నానీ బొద్దెక్కాడు.. ఇదేనా `వీ` లుక్?

0

నేచురల్ స్టార్ నాని ల్యాండ్ మార్క్ (25వ) చిత్రం `వీ`. ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో నాని రెండు విభిన్న పాత్రలు పోషిస్తున్నాడు. ఒక పాత్రలో విలన్ గా కనిపించనుండగా వేరొక పాత్ర సస్పెన్స్ అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇక వీ చిత్రంలో సుధీర్ బాబు కాప్ పాత్రలో నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ సినిమా సెట్స్ లో ఉంది. తాజాగా నాని న్యూ లుక్ ఒకటి కెమెరా కంటికి చిక్కింది. హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టులో ఇలా కెమెరాకి చిక్కడంతో ఇదే వీ లుక్ అంటూ సోషల్ మీడియాలో దుమారం మొదలైంది.

నాని ఈ ఫోటోలో మునుపటి కంటే స్మార్ట్ లుక్ లో కనిపిస్తున్నాడు. షార్ట్ హెయిర్ స్టైల్ తో లవర్ బోయ్ లుక్ లో ఉన్నాడు. బ్లాక్ ఫ్యాంట్…టీ షర్ట్ పైన జర్కిన్ ధరించాడు. చేతిలో ఫోన్.. ముఖంలో చిన్న చిరునవ్వు…. కళ్లకి రేబాన్ అద్దాలతో చూపరులను ఆకట్టుకుంటున్నాడు. వీటన్నిటినీ మించి నాని మునుపటి కంటే కాస్త బొద్దెక్కి కనిపిస్తుండడం మరో సర్ ప్రైజ్. మరి ఇది వీ షూట్ కి సంబంధించిందా? వ్యక్తిగతంగా ఎక్కడికైనా టూర్ వెళ్తున్నప్పుడు తీసిన స్నాప్ నా అన్నది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వీ సినిమా రెగ్యులర్ షూటింగ్ శర వేగంగా జరుగుతోంది. ఇప్పటికే మేజర్ పార్ట్ షూటింగ్ ఓ కొలిక్కి వచ్చింది. అతి త్వరలోనే టీజర్ రిలీజ్ చేసే అవకాశం ఉంది.

షూటింగ్ సహా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి చేసి ఉగాది సందర్భంగా మార్చి 25న రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ తేదీని ప్రకటించిన సంగతి తెలిసిందే. సైరా నరసింహారెడ్డి చిత్రానికి సంగీతం అందించిన అమిత్ త్రివేది `వీ` సినిమాకి బాణీలు సమకూరుస్తున్నారు. ఈ సినిమా అనంతరం నాని నిన్ను కోరి ఫేం శివ నిర్వాణ దర్శకతంలో టక్ జగదీశ్ చిత్రం షూటింగ్ లో నానీ పాల్గొంటాడు. ఇదివరకూ ప్రకటన వెలువడిన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer