నానీతో సమంత కొత్త మజిలీ?

0

గ్యాంగ్ లీడర్ రిలీజ్ తర్వాత వీ చిత్రీకరణలో బిజీ అయిపోయాడు నాని. ఇంద్రగంటి దర్శకత్వంలో ఈ సినిమా శరవేగంగా పూర్తవుతోంది. ఈ సినిమా తర్వాత నాని నటించే సినిమా ఏది? అంటే తాజాగా సమాధానం లభించింది. గత కొంతకాలంగా నాని- సమంత జంటగా నటించే సినిమా గురించి చర్చ సాగుతోంది. తాజాగా ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వచ్చింది.

నానీతో నిన్నుకోరి .. సమంతతో మజిలీ చిత్రానికి పని చేసిన వైజాగ్ కుర్రాడు శివ నిర్వాణ ఈసారి ఆ ఇద్దరినీ కలిపి సినిమా తీస్తున్నాడు. నేడు ఈ సినిమాని ప్రకటించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్ నిర్మిస్తున్న మూడో చిత్రమిది. నిర్మాతలు సాహు గారపాటి.. హరీష్ పెద్ది ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన పనుల్లో బిజీ బిజీ.

నాని కెరీర్ లో 26వ చిత్రమిది. తాజాగా పోస్టర్ రివీల్ చేసి ప్రాజెక్టును అధికారికంగా ఖాయం చేశారు. అయితే ఎప్పటి నుంచి షెడ్యూల్ మొదలవుతుంది అన్నది తెలియాల్సి ఉంది. ఇక ఇందులో కాస్టింగ్ ఇతర క్రూ వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. నిన్ను కోరి .. మజిలీ చిత్రాలతో ఫ్యామిలీ ఎమోషన్స్ ని వర్కవుట్ చేయడంలో శివ నిర్వాణ ప్రతిభకు గుర్తింపు వచ్చింది. ఈసారి ఎలాంటి సినిమాని తీస్తున్నారు? అన్నది చూడాల్సి ఉంది.
Please Read Disclaimer