ఘరానా మొగుడు ఈజ్ బ్యాక్ అంటున్న నాచురల్ స్టార్

0

ఇప్పుడు ఇండియాలో ఎక్కడ చుసినా సైరా గురించి టాపిక్ నడుస్తుంది. నిన్న విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ టాక్ తో రన్ అవుతుంది. ప్రేక్షకుల నుండే కాకుండా సినీ పరిశ్రమ వర్గాల వాళ్ళు కూడా ఈ సినిమాని – చిరంజీవిని – ఇందులో నటించిన నటీనటులను ఆకాశానికి ఎత్తేస్తున్నారు. యూవీ క్రియేషన్స్ – మహేష్ – సాయిధరమ్ లాంటి చాలామంది మోహన్ బాబు లాంటి ఎందరో ఈ సినిమా గురించి ట్వీట్ చేశారు. బాలీవుడ్ లో కూడా ఈ సినిమా ఒక రేంజ్ లో దూసుకుపోతుంది. బాలీవుడ్ సినిమా క్రిటిక్స్ కూడా ఈ సినిమాకి మంచి రేటింగ్స్ ఇచ్చారు.

నాచురల్ స్టార్ నాని కూడా ఇప్పుడు సైరా సినిమా గురించి ట్వీట్ చేశాడు. తాను దక్షిణకొరియాలో ఉన్నానని అందుకే సినిమా చూడలేక పోయానని – కానీ సినిమా టాక్ విన్నానని – ఘరానా మొగుడు ఈజ్ బ్యాక్ అని – చిరంజీవికి ఇక్కడి నుండే కౌగిలింత ఇస్తున్నా అని ట్వీట్ చేశాడు. ఇంతకుముందు కూడా చాలాసార్లు చిరంజీవి తన ఫేవరేట్ హీరో అని నాని చెప్పాడు. ఇప్పుడు తన ఫేవరేట్ హీరో సినిమా గురించి ఇలా ఆకాశానికెత్తేశాడు.