ఆ హీరోయిన్ కు ‘నో’ అన్న నాని?

0

హీరోయిన్ హీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ కుదరడం ఒక సినిమా విజయానికి చాలా కీలకం. అందుకే స్టార్ హీరోల సినిమాల నుండి మీడియం రేంజ్ హీరోల సినిమాల వరకూ హీరోయిన్ సెలెక్షన్ కు చాలా ప్రాధాన్యతనిస్తారు. అంతే కాదు హీరో- హీరోయిన్ పెయిరింగ్ కనుక రొటీన్ అయిందని అనిపిస్తే కొత్తదనం కోసం కూడా వేరే హీరోయిన్లను వెతుకుతారు. ఇలాంటి పరిస్థితుల్లో అటు సీనియర్ స్టార్ల కు జోడీగా నటిస్తూ ఇటు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లాంటి యువ హీరోలతో రొమాన్స్ చేస్తూ తన కెరీర్లో బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.

ఇప్పుడు కాజల్ టాపిక్ ఎందుకు వచ్చిందంటే.. నాని తాజా చిత్రానికి కాజల్ ను హీరోయిన్ గా తీసుకుందామని నిర్మాతలు అనుకున్నారట. కానీ నాని మాత్రం కాజల్ తో పెయిరింగ్ కు ఆసక్తి చూపించలేదని టాక్. కాజల్ వయసు ఎక్కువగా కనిపించే అవకాశం ఉందన్నది ఒక రీజన్ అయితే.. స్టొరీ ప్రకారం ఒక యంగ్ హీరోయిన్ ఉంటే బాగుంటుందన్నది మరో కారణం అట. దీంతో కాజల్ ఆప్షన్ కు నాని ‘నో’ చెప్పాడని టాక్.

చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తారు. మైత్రీ వారు ‘తెరి’ రీమేక్ కోసం రవితేజ కు హీరోయిన్ గా తీసుకునేందుకు గతంలో కాజల్ డేట్స్ తీసుకున్నారట. ఆ సినిమా ఇప్పుడు హోల్డ్ లో పడింది కాబట్టి కాజల్ డేట్స్ ను నాని-చంద్రశేఖర్ ఏలేటి సినిమాకు వాడుకుందామంటే నాని వీటో చేశాడట. కానీ అలాంటిదేమీ లేదని ఇది ఉత్త గాసిప్ అని కాజల్ సన్నిహితులు అంటున్నారు. మరోవైపు మైత్రీవారు కూడా ఈ వ్యవహారం పై స్పందించలేదు.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-