విలన్ రోల్ పై స్పందించిన నాని

0

నాని నటించిన ‘గ్యాంగ్ లీడర్’ సినిమాలో కార్తికేయ విలన్ గా నటించాడు. సుధీర్ బాబు ‘వీ’ సినిమాలో నాని విలన్ గా నటిస్తున్నాడు. వీరిద్దరే కాదు వరుణ్ కూడా ‘వాల్మీకి’ లో నెగిటీవ్ షేడ్స్ తో ఉండే రౌద్రమైన పాత్ర చేస్తున్నాడు. ఇలా యువ హీరోల్లో కొంత మంది కొత్తదనం ఉన్న పాత్రలకు ఓటేస్తూ విలన్ గా నటించడానికి సైతం వెనకంజ వేయకుండా ముందుకెళ్తున్నారు.

అయితే ఈ విషయంపై లేటెస్ట్ స్పందించాడు నాని. హీరోగా చేస్తున్న టైంలో విలన్ గా నటించడం కరెక్టేనా..అనే ప్రశ్నకు సమాధానం చెప్పాడు. ఇక నుండి ఇలాంటి క్యారెక్టర్స్ చేయడానికి ఎవరికీ భయాలుండవని దైర్యంగా చేస్తారని అన్నాడు. ఇప్పుడు ప్రేక్షకులు ప్రోత్సహిస్తున్నారని కొత్త కథలతో సినిమాలు చూడలనుకుంటున్నారని అందుకే మేము కూడా ఏం ఆలోచించకుండా వారిని డిఫరెంట్ గా ఎంటర్టైన్ చేయడానికి విలన్ పాత్రకైనా గ్రీన్ సిగ్నల్ ఇస్తున్నామని తెలిపాడు.

నిజంగా ఇది మంచి పరిణామమే. యువ హీరోలు ఇలా విభిన్న పాత్రలు చేయడానికి ముందుకొస్తే తెలుగులో మరిన్ని కొత్త కథలొస్తాయి. ప్రేక్షకులు కూడా కొత్త అనుభూతి పొందుతారు. ‘నానీస్ గ్యాంగ్’ లీడర్ సెప్టెంబర్ 13న విడుదలవుతుంది. ‘వాల్మీకి’ కూడా ఒకే రోజు థియేటర్స్ లోకొస్తుంది. ఈ రెండు సినిమాల్లో వరుణ్ – కార్తికేయ క్రూరమైన పాత్రలతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మరి వీరి పాత్రలకు ప్రేక్షకుల నుండి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
Please Read Disclaimer