వైజాగ్ లవ్ స్టోరీతో గాలం వేసిన నాని

0

నేచురల్ స్టార్ నానీకి వైజాగ్ తో ఉన్న అనుబంధం గురించి తెలిసిందే. ఆయన వైజాగ్ కుర్రాడు అని చాలా మంది భావిస్తారు. కానీ కానే కాదు. నాని అలియాస్ నవీన్ బాబు (అసలు పేరు) వైజాగ్ అల్లుడు మాత్రమే. విశాఖకు చెందిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్ అంజన ఎలవర్తిని ప్రేమించి పెద్దల్ని ఒప్పించి పెళ్లాడాడు. ఐదేళ్ల డేటింగ్ అనంతరం 2012లో పెళ్లాడుకున్నారు. అందుకే అతడిని ఇంటి అల్లుడిగా గౌరవించి వైజాగ్ అంతగా లవ్ చేస్తుంది. ఈ మంగళవారం సాయంత్రం వైజాగ్ లో గ్యాంగ్ లీడర్ ప్రీరిలీజ్ ఈవెంట్ కి నాని అభిమానులు వచ్చారు.

ఈ వేడుకలో నాని స్పీచ్ అదిరింది. ఒక రకంగా వైజాగ్ తో ఉన్న కనెక్షన్ గురించి చెప్పడం ద్వారా సెంటిమెంటును టచ్ చేశాడు నేచురల్ స్టార్. వేడుకలో నాని మాట్లాడుతూ – “పది సంవత్సరాల క్రితం వైజాగ్ అమ్మాయితో ప్రేమలో పడ్డాను. అప్పటినుండి ఇప్పటి దాకా ఈ సిటీతో లవ్లోనే ఉన్నాను. మనోళ్లు పాటలు తీయాలంటే విదేశాలకు వెళుతుంటారు కానీ ఇంతకంటే మంచి ప్లేస్ ఎక్కడుంటుంది చెప్పండి?“ అంటూ సిటీ ఫ్యాన్స్ ని ఐస్ చేసేశాడు.

నాని నటించిన తొలి సినిమా `అష్టాచెమ్మా` రిలీజ్ కి మూడు రోజుల ముందు ప్రీమియర్ షో వైజాగ్ లోనే వేశారట. ఎలా గడిచిందో తెలీదు కానీ నా కెరీర్ ప్రారంభించి 11 సంవత్సరాలు పూర్తయింది . మళ్ళీ `గ్యాంగ్ లీడర్` కి మూడు రోజుల ముందు ఇక్కడ ప్రీ రిలీజ్ వేడుక చేస్తున్నామని సెంటిమెంటును రాజేశాడు నాని. కెరీర్ మరో 11 సంవత్సరాలు సేఫ్. సెప్టెంబర్ 13 నుండి వైజాగ్ లో ఏ థియేటర్స్ లో టికెట్స్ దొరకకుండా చూసుకునే బాధ్యత మీదే.. అంటూ బాగానే బిస్కెట్ వేశాడు. మనం సమయంలోనే విక్రమ్ తో సినిమా చేయాలనుకున్నామని ఇప్పటికి కుదిరిందని నాని ఈ సందర్భంగా తెలిపాడు. అయినా సెంటిమెంటుతో వైజాగ్ – ఉత్తరాంధ్రకు గాలం వేసినంత మాత్రాన హిట్టిస్తారా? మూవీలో కంటెంట్ ఉంటే అదే హిట్టవుతుందిగా!!
Please Read Disclaimer