సాహో లో ప్రభాస్ వాడిన బ్లూటూత్ గురించి మీకు తెలియని సీక్రెట్స్!!

రీమేక్ చేసి దీన్ని చెడగొట్టొదన్నాను : నాని

0

శర్వానంద్.. సమంత జంటగా నటించిన ’96’ రీమేక్ ‘జాను’ ఈనెల 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. ఈ రీమేక్ ను మొదలు పెట్టిన సమయంలో పలువురు ఒక క్లాసిక్ మూవీని చెడగొడుతున్నారేమో అంటూ అనుమానాలు వ్యక్తం చేశారు. దిల్ రాజు రీమేక్ రైట్స్ తీసుకున్న సమయంలో కూడా ఆ ఆలోచన మానుకోవాలంటూ చాలా మంది సూచించారట. ఎవరేం అన్నా కూడా దిల్ రాజు ఏదో నమ్మకంతో ఈ సినిమాను రీమేక్ చేశాడు.

జాను ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా నాని పాల్గొన్నాడు. ఈ సందర్బంగా నాని కూడా అదే మాట మాట్లాడాడు. ఒపీనియన్ కోసం నన్ను ఈ సినిమాను చూడమన్న సమయంలో క్లాసిక్ సినిమాను చెడగొట్టొద్దంటూ నేను సూచించాను. రీమేక్ గురించి వార్తలు వచ్చిన ప్రతి సారి ఎందుకు చెడగొడుతున్నారా అనుకున్నాను. కాని ఎప్పుడైతే శర్వానంద్ మరియు సమంతలతో ఈ రీమేక్ చేస్తున్నారని తెలిసిందో అప్పటి నుండి కూడా ఈ సినిమా ఎప్పుడెప్పుడు చూస్తానా అంటూ ఎదురు చూస్తున్నానంటూ నాని చెప్పుకొచ్చాడు.

నాకు ఇండస్ట్రీలో మొదటి స్నేహితుడు శర్వానంద్. సినిమా ఫంక్షన్స్ లో కాకుండా అప్పుడప్పుడు బయట కూడా రీయూనియన్ అవ్వాలంటూ శర్వాకు నాని చురక అంటించాడు. ఇదే సమయంలో సమంత గురించి మాట్లాడుతూ ఆమె ఒక మంచి నటి అన్నాడు. ఇద్దరు పోటీ పడి మరీ నటించి ఉంటారని అనుకుంటున్నాను. ఎటో వెళ్లి పోయింది మనసు సినిమాను సమంతతో ఇప్పుడు చేస్తే బాగుంటుందని నాని అన్నాడు. ఈ చిత్రం సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నాని శుభాకాంక్షలు తెలియజేశాడు.
Please Read Disclaimer