గోదావరి బాట పట్టబోతున్న నాచురల్ స్టార్

0

నాచురల్ స్టార్ నాని ప్రస్తుతం తన 25వ చిత్రం ‘వి’ షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. మరో రెండు మూడు నెలల్లో వి షూటింగ్ ను పూర్తి చేసే అవకాశం ఉంది. మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందుతున్న ‘వి’ సినిమాలో హీరోగా సుధీర్ నటిస్తుండగా కీలక పాత్రలో నాని నటిస్తున్నాడు. విలన్ అంటూ ప్రచారం జరుగుతుంది.. కాని ఇప్పటి వరకు యూనిట్ సభ్యుల నుండి ఎలాంటి అప్ డేట్ అయితే రాలేదు. ఇక నాని తదుపరి చిత్రం విషయమై ఈమద్య తెగ వార్తలు వస్తున్నాయి.

ఇటీవలే నాని తర్వాత సినిమా శివ నిర్వాన దర్శకత్వంలో అంటూ ప్రకటన వచ్చింది. వీరిద్దరి కాంబోలో వచ్చిన నిన్నుకోరి సినిమా మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. అందుకే మరోసారి శివ నిర్వాన దర్శకత్వంలో సినిమాను చేసేందుకు నాని చాలా ఆసక్తిగా ఉన్నాడు. మజిలీ చిత్రంతో వరుసగా విజయాలను తన ఖాతాలో వేసుకున్న శివ నిర్వాన మరో మంచి ఎమోషనల్ డ్రామా కథను నానికి వినిపించాడని వెంటనే ఓకే చెప్పాడని తెలుస్తోంది.

ఇక నాని.. శివ నిర్వానల కాంబో మూవీ గోదావరి బ్యాక్ డ్రాప్ లో ఉంటుందని సమాచారం అందుతోంది. ఈమద్య కాలంలో గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమాలు చాలా తక్కువ అయ్యాయి. ఒకప్పుడు సంవత్సరంలో రెండు మూడు అయినా వచ్చేవి. కాని ఇప్పుడు యంగ్ డైరెక్టర్స్ గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమాలపై ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు శివ నిర్వాన గోదావరి బ్యాక్ డ్రాప్ లో సినిమాను చేసేందుకు సిద్దం అవుతుండటంతో అందరు ఆయన వైపు ఆసక్తి చూస్తున్నారు. గోదావరి యాసలో నాని ఎలా మాట్లాడుతాడో చూడాలి. ఏ పాత్రలో అయినా లీనం అయ్యి జీవించేసే నాని ఈ సినిమాలో కూడా మంచి నటన ప్రదర్శించడం ఖాయం అంటూ ఆయన అభిమానులు అనుకుంటున్నారు.
Please Read Disclaimer