ఎంత ట్రై చేసినా నాని వల్ల కాలేదు!

0

సభ్య సమాజంలో చాలామందికి సెంటిమెంట్లు ఉంటాయి అయితే సినిమా పరిశ్రమలో ఉన్న సెలబ్రిటీలకు ఆ సెంటిమెంట్లు రెండాకులు ఎక్కువే. తాజాగా గ్యాంగ్ లీడర్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన దర్శకుడు విక్రమ్ కుమార్ కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. అదేంటంటే తన సినిమాలలో హీరోయిన్ కు ప్రియ అనే పేరు పెడుతూ ఉంటాడు. ’13’ నుంచి ఇప్పటివరకూ అదే తంతు. ‘గ్యాంగ్ లీడర్’ లో కూడా హీరోయిన్ ప్రియాంక మోహన్ పోషించిన పాత్ర పేరు ‘ప్రియ’. దీంతో అసలు ప్రియ వెనక కథేంటో తెలుసుకోవాలని చాలామందికి ఆసక్తిగా ఉంది.

గ్యాంగ్ లీడర్’ ప్రమోషన్స్ లో భాగంగా సుమ నిర్వహించిన కార్యక్రమానికి నాని.. విక్రమ్ కుమార్.. ప్రియాంక హాజరయ్యారు. సుమ సరిగ్గా ఇదే ప్రశ్నను విక్రమ్ కుమార్ కు సంధించింది. అయితే ఇంటెలిజెంట్ డైరెక్టర్ కదా.. అసలు విషయంచెప్పకుండా ప్రియ ఓ అందమైన పేరని.. ఆ పేరులో సౌండింగ్ తనకు ఇష్టమని ఏదో కవరింగ్ ఇచ్చాడు. తనకు ఆ పేరుతో దీప కనెక్షన్ ఉందన్న విషయం ఒప్పుకున్నాడు కానీ దాని గురించి మాత్రం మాట్లాడలేదు. పక్కనే కూర్చుని ఉన్న నాని వెంటనే అందుకొని “నేను కూడా ఆ పేరు వెనక కథ తెలుసుకుందామని ప్రయత్నించాను కానీ కుదరలేదు. విక్రమ్ భార్య పేరు కూడా కాదు” అంటూ తన వెర్షన్ వినిపించాడు.

అయితే ఆ టాపిక్ ను కొనసాగించిన హీరోయిన్ ప్రియాంక “ఆ కథ నాకు తెలుసు. కానీ చెప్పను” అంటూ సస్పెన్స్ ను మరింతగా పెంచింది. దీనికి స్పందించిన నాని విక్రమ్ ఆ విషయాన్ని ఎప్పటి నుంచో పరిచయం ఉన్న తనకు చెప్పకుండా ఈమధ్యే వచ్చిన ప్రియాంకకు చెప్పడం అన్యాయం అని విక్రమ్ పై రుసరుసలాడాడు. ఇంత హంగామా జరిగినా.. ఆ ప్రియ సీక్రెట్ మాత్రం సీక్రెట్ గానే మిగిలిపోయింది!
Please Read Disclaimer