హిట్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్న నాని.. విజయ్!

0

సినిమా అంటే కళ అని చాలామంది అంటుంటారు కానీ కళ కంటే ఎక్కువగా అదో బిజినెస్. అలా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే కళాత్మకమైన సినిమాలు తీసే ఫ్లాపు డైరెక్టర్లకు నిర్మాతలు దొరకరు కాబట్టి. అందుకే అటు హీరోలైనా ఇటు నిర్మాతలైనా హిట్ ఇచ్చే దర్శకులతోనే పని చేయాలని ఇంట్రెస్ట్ చూపిస్తారు. అందులో తప్పుపట్టాల్సింది కూడా ఏమీ లేదు. చాలామంది హీరోలు సేఫ్ జోన్ లో ఉండడం కోసం ఆ రూట్ ఎంచుకుంటారు.

న్యాచురల్ స్టార్ నాని గతంలో ఇలానే వరసగా హిట్ ఇచ్చిన డైరెక్టర్లతో పని చేశాడు. కానీ మధ్యలో రూట్ మార్చి అందరితో పని చేయడం మొదలు పెట్టాడు. అయితే ఈమధ్య నానికి హిట్స్ తగ్గాయి.. ఫ్లాపుల శాతం పెరిగింది. దీంతో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో రిస్క్ తీసుకునేందుకు ఇష్టపడడంలేదట. సేఫ్ గా ఉండేందుకు హిట్స్ మీద ఉన్న యంగ్ డైరెక్టర్ల కోసం వెతుకుతూ ఉన్నాడట. రీసెంట్ గా ఒక హిట్ ఇచ్చిన దర్శకులనే తమ నెక్స్ట్ సినిమాలకు ఎంచుకుంటున్నాడట.

మరోవైపు యువహీరో విజయ్ దేవరకొండ కూడా నాని స్టైల్ నే ఫాలో అవుతున్నాడని అంటున్నారు. ఈమధ్య రిస్క్ తీసుకున్న ప్రాజెక్టులు ఆశించిన ఫలితం ఇవ్వకపోవడంతో ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నాడట. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’.. ముందుగా ఒప్పుకున్న ‘హీరో’ లను పక్కన పెడితే ఇతర ప్రాజెక్టుల విషయంలో సేఫ్ గా ఉంటున్నాడట. ‘ఇస్మార్ట్ శంకర్’ తో సూపర్ హిట్ ఇచ్చిన పూరితో సినిమాకు ఒప్పుకోవడం.. ‘మజిలీ’ తో బ్లాక్ బస్టర్ తన ఖాతాలో వేసుకున్న శివ నిర్వాణకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడానికి కారణం అదేనట. ఈ దర్శకులే కాదు.. ఫామ్ లో ఉన్న ఇతర దర్శకులపైన నాని.. విజయ్ లు ఎక్కువగా దృష్టిసారిస్తున్నారట.
Please Read Disclaimer