‘సైరా’ పై నారా లోకేష్ ప్రశంస

0

మెగాస్టార్ చిరంజీవి నటించిన `సైరా-నరసింహారెడ్డి` సంచలనాల గురించి తెలిసిందే. తెలుగు రాష్ట్రాల్లో అభిమానుల సందడితో థియేటర్ల ముందు కోలాహాలం కనిపిస్తోంది. తొలి స్వతంత్య్ర సమరయోధుడు.. బయటి ప్రపంచానికి ఆవిష్కృతం కాని రేనాటి వీరుడు అయిన ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి కథతో తెరకెక్కించిన సైరా అద్భుత విజయాన్ని ట్రేడ్ సెలబ్రేట్ చేసుకుంటోంది. ఈ విజయం నేపథ్యంలో అల్లు అరవింద్ .. మెగా హీరోలందరికీ.. సైరా టీమ్ కి స్పెషల్ పార్టీ ఇచ్చారు.

తెలుగు సినిమా స్థాయిని పెంచిన చిత్రమిది అంటూ సెలబ్రిటీలు ప్రశంసలు కురిపిస్తున్నారు. చిరంజీవి నటన.. సురేందర్ రెడ్డి దర్శకత్వ ప్రతిభకు .. రామ్ చరణ్ నిర్మాణ విలువలకు ప్రశంసలు దక్కాయి. దర్శకేంద్రుడు కె.రాఘవేంద్ర రావు.. ఎస్.ఎస్. రాజమౌళి.. త్రివిక్రమ్.. సుకుమార్.. వంశీ పైడిపల్లీ వంటి దిగ్గజాల ప్రశంసలు ఈ సినిమాకి బూస్ట్ ని ఇచ్చాయి. పలువురు సినీ-రాజకీయ ప్రముఖులు సైరా చిత్రాన్ని వీక్షించి చిరంజీవి బృందంపై ప్రశంసలు కురిపించారు.

తాజాగా నారా లోకేష్ సైరా సినిమాని వీక్షించారు. ఈ సినిమాపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు. “తెలుగు సినిమా స్థాయిని శిఖరానికి చేర్చిన మెగా సినిమా సైరా. చిరంజీవిగారి 12 ఏళ్ళ కల ఇది. ఆయన తన కలను ఎంతో అద్భుతంగా ఆవిష్కరించుకున్నారు. తెలుగువీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి స్వాతంత్య్ర పోరాటాన్ని తెరపై చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడిచింది. హ్యాట్సాఫ్ చిరంజీవిగారు. ఎంతో శ్రమించి అద్భుతంగా తెరకెక్కించి విజయాన్ని అందుకున్న నిర్మాత రామ్ చరణ్.. దర్శకుడు సురేందర్ రెడ్డి.. చిత్ర యూనిట్ కి హార్ధికాభినందనలు“అంటూ ప్రశంసించారు. సైరా చిత్రం రెండ్రోజుల్లోనే బాక్సాఫీస్ వద్ద 100కోట్లు పైగా వసూలు చేసిందని రిపోర్ట్ అందింది ఇప్పటికే.
Please Read Disclaimer