వారికి మద్దతు తెలిపిన మొదటి తెలుగు హీరో

0

ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజధాని విషయం చాలా సీరియస్ గా ఉన్న విషయం తెల్సిందే. అమరావతి మాత్రమే రాజధాని కాకుండా అభివృద్ది వికేంద్రీకరణ జరగాలి అంటే రాజధానులు మూడు ఉండాలంటూ ప్రభుత్వం ఆలోచనగా తెలుస్తోంది. ప్రభుత్వం నిర్ణయంను తప్పుబడుతూ గత మూడు వారాలుగా అమరావతి రైతులు ఆందోళనలు చేస్తున్న విషయం తెల్సిందే. తెలుగు దేశం పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ఆందోళనలు రోజు రోజుకు మిన్నంటుతున్నాయి.

గత కొన్ని రోజులుగా అమరావతి రైతులు టాలీవుడ్ ప్రముఖులు రాజధాని అమరావతికి మద్దతు తెలపాల్సిందిగా కోరుతున్నారు. అమరావతికి మద్దతు తెలపకుంటే త్వరలో సినిమాల ప్రదర్శణను కూడా అడ్డుకుంటామంటూ హెచ్చరించారు. అయినా కూడా టాలీవుడ్ నుండి పెద్దగా స్పందన లేదు. చిరంజీవి మూడు రాజధానులకు ఓకే అన్నట్లుగానే స్పందించాడు. ఇంకా కొందరు కూడా మూడు రాజధానులకు ఓకే అన్నట్లుగానే ఉన్నారు. కాని ఇప్పటి వరకు అమరావతికి మద్దతుగా మాత్రం ఏ హీరో నిలవలేదు.

మొదటి సారి తెలుగు సినిమా పరిశ్రమ నుండి ఒక హీరో అమరావతి రైతుల పక్షాన నిలిచేందుకు ముందుకు వచ్చాడు. వారితో ఉద్యమించేందుకు రెడీ అయ్యాడు. ఆయనే నారా రోహిత్. తెలుగు దేశం అధినేత చంద్రబాబు నాయుడు సోదరుడి తనయుడు అయిన నారా రోహిత్ అమరావతి రైతుల పక్షాన నిలుస్తానంటూ ప్రకటించాడు. మీరు చేస్తున్న ఉద్యమం.. ఆందోళన న్యాయబద్దమైనది. మీకు నా మద్దతు ఉంటుందని వారిని కలిసిన రోహిత్ ప్రకటించాడు.
Please Read Disclaimer