చిరంజీవి మరియు పెద్దలు పెట్టిన రూల్స్ నే మార్చేస్తారా?

0

మా వివాదం మళ్లీ మొదటికి వచ్చినట్లయ్యింది. శివాజీ రాజా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో వివాదం మొదలై ఎంత దూరం వెళ్లిందో ప్రతి ఒక్కరికి తెల్సిందే. శివాజీ రాజా నుండి అధ్యక్ష పదవి నటుడు నరేష్ తీసుకున్న తర్వాత కొంత కాలం వరకు బాగానే ఉందనిపించింది. కాని పరిస్థితి చూస్తుంటే మా వివాదం ముదిరి పాకాన పడ్డట్లయ్యింది. అధ్యక్షుడు నరేష్ కు వ్యతిరేకంగా మా సభ్యులు కొందరు మీటింగ్ పెట్టడం.. మా రాజ్యాంగంను మార్చాలని భావించడం వంటి పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయంటూ మా సభ్యులు కొందరు అంటున్నారు.

ఇటీవల జరిగిన మా ఫ్రెండ్లీ మీటింగ్ లో హాజరు అయిన ఒక లాయర్ మా రాజ్యాంగంలో పలు తప్పులు ఉన్నాయి… వాటిని సరిదిద్దాలి లేదంటే పూర్తిగా తొలగించాలని అన్నాడు. ఈ విషయంపై అధ్యక్షుడు నరేష్ చాలా సీరియస్ అవుతున్నారు. 26 సంవత్సరాలుగా కొనసాగుతున్న మా బైలాన్ ను మార్చాల్సిన అవసరం ఇప్పుడేం వచ్చిందని అన్నాడు. చిరంజీవి గారు అధ్యక్షుడిగా ఉన్న మా బైలాన్ ను ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు మార్చేసుకోవచ్చా అంటూ ప్రశ్నించాడు.

అప్పట్లో నాగేశ్వరరావు.. కృష్ణ.. కృష్ణం రాజు గారు ఇంకా ప్రముఖుల సలహాలతో తయారు అయిన మా రాజ్యాంగంను మార్చాలనే ప్రయత్నాలు మానుకోవాలని నరేష్ సూచించారు. మా బైలాన్ మార్చాలంటే సలహాదారుగా ఉన్న కృష్ణం రాజు వ్యవస్థాపక అధ్యక్షులు అయిన పెద్దలను కూడా సంప్రదించాలని ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ నడవదంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. అధ్యక్షుడు నరేష్ లేకుండానే జనరల్ బాడీ మీటింగ్ ను ఏర్పాటు చేసేందుకు జీవిత రాజశేఖర్ ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం అందుతోంది. ఆ మీటింగ్ లో సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశాలు కూడా లేకపోలేదు అంటూ సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
Please Read Disclaimer