నర్తనశాల ఫస్ట్ లుక్: నాగ శౌర్య ఆనంద నర్తనం

0టాలీవుడ్ లో యంగ్ హీరోలు చాలామందే ఉన్నారు.. వాళ్ళలో కొద్దిమంది స్టార్స్ కూడా ఉన్నారు గానీ వాళ్ళలో ఒక టాల్ & హ్యాండ్సమ్ హీరో ఎవరని అడిగితే నాగశౌర్య పేరు తప్పనిసరిగా చెప్పాల్సిందే. మనోడికి అమ్మాయిల్లో మంచి ఫాలోయింగ్ కూడా ఉంది.. ‘ఛలో’ తో గాడిలో పడ్డట్టు అనిపించినా కణాలు.. అమ్మమ్మగారిళ్ళతో ఆ ఆనందం కాస్తా అవిరయ్యింది! ఇప్పుడు మళ్ళీ చాలా రోజులకు ఆనందంగా కనిపిస్తున్నాడు.

ఎక్కడ అనే అనుమానం మీకొద్దు.. ‘@నర్తనశాల’ అనే సినిమా ఫస్ట్ లుక్ లో. కాసేపటి క్రితం ‘@నర్తనశాల’ టీమ్ ఈ సినిమా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది. మాంచి బ్రైట్ స్మైల్ తో అంతెత్తున ఎగిరిమరీ ఆనందనర్తనం చేస్తున్నాడు. సినిమాలో ఒక పాటలోని డాన్స్ మూవ్ మెంట్ నుండి ఈ స్టిల్ ను ‘ఫ్రెష్ లుక్’ గా తీసుకుని రిలీజ్ చేశారని ప్రత్యేకంగా చెప్పనక్కర లేదు కదా. ఫస్ట్ లుక్ కలర్ థీం చాలా ఇంప్రెసివ్ గా ఉంది.

ఈ సినిమాతో శ్రీనివాస్ చక్రవర్తి డైరెక్టర్ గా పరిచయం అవుతున్నాడు. శౌర్య అమ్మగారు ఉష మూల్పురి ఈ సినిమాను ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.. నాన్నగారు శంకర్ ప్రసాద్ ఈ సినిమాకు సమర్పకుడు. ఐరా క్రియేషన్స్ బ్యానర్ పై నుండి వస్తున్న రెండో సినిమా ఇది. మొదటి సినిమా ‘ఛలో’ సూపర్ హిట్ అయిన విషయం తెలిసిందే. దీంతో ప్రేక్షకుల్లో – ట్రేడ్ వర్గాలలో ఈ సినిమాపై మంచి ఆసక్తి నెలకొని ఉంది.