కరణ్ బండారం బయట పెట్టిన జాతీయ అవార్డు గ్రహీత

0

బాలీవుడ్ స్టార్ ఫిల్మ్ మేకర్ కరణ్ జోహార్ ను ఎంత మంది గొప్ప వ్యక్తి అంటూ పిలుస్తారో అంతకు మించిన వారు అతడి తీరును తప్పుబడుతూ ఉంటారు. ప్రతిభను తోచుకోవడం.. కష్టాన్ని వాడుకోవడం వంటివ చేస్తాడంటూ విమర్శలు గుప్పిస్తూ ఉంటారు. తాజాగా జాతీయ అవార్డు గ్రహీత సీనియర్ దర్శకుడు మాధుర్ బండార్కర్ మాట్లాడుతూ కరణ్ జోహార్ పై తీవ్ర విమర్శలు చేశాడు.

తాను రిజిస్ట్రర్ చేయించిన బాలీవుడ్ వైవ్స్ ను కాపీ కొట్టి తాను వెబ్ సిరీస్ చేస్తున్నాడు అంటూ ఆరోపించాడు. మాధుర్ బండార్కర్ దర్శకత్వంలో బాలీవుడ్ వైవ్స్ సినిమా రూపొందుతుంది. అందుకు సంబంధించిన చిత్రీకరణ ఇప్పటికే మొదలు పెట్టినట్లుగా ఆయన చెప్పుకొచ్చాడు. ఆ సినిమా టైటిల్ ను కరణ్ జోహార్ తన వెబ్ సిరీస్ కు వాడుకోవడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశాడు.

బాలీవుడ్ వైవ్స్ టైటిల్ ను తనకు ఇవ్వాలంటూ కరణ్ జోహార్ అడిగారు. కాని నేను రిజిస్ట్రర్ చేయించి సినిమాను కూడా మొదలు పెట్టిన కారణంగా ఇవ్వను అంటూ చెప్పాను. తాను ఆ టైటిల్ ఇవ్వక పోవడంతో తన వెబ్ సిరీస్ కు ఫ్యాబులస్ లైవ్స్ ఆఫ్ బాలీవుడ్ వైవ్స్ టైటిల్ ను పెట్టాడు. నెట్ ప్లిక్స్ కోసం అతడు నిర్మిస్తున్న వెబ్ సిరీస్ కోసం తన టైటిల్ ను ఇన్సిపిరేషన్ గా తీసుకుని పెట్టడం ఏమాత్రం కరెక్ట్ కాదన్నాడు. బాలీవుడ్ వైవ్స్ రిజిస్ట్రర్ చేయించాను.

మేము రిజిస్ట్రర్ చేసిన టైటిల్ ను ఆయన వాడుకోవడం అనైతికం అంటూ మాధుర్ బండార్కర్ అన్నారు. దర్శకుడిగా పలు సూపర్ హిట్ లు అందుకున్న దర్శకుడు ఇప్పుడు ఆశించిన స్తాయిలో సక్సెస్ లను అందుకోలేక పోతున్నాడు. బాలీవుడ్ వైవ్స్ తో అయినా సక్సెస్ దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నాడు. ఇలాంటి సమయంలో టైటిల్ గోల్ మాల్ అవ్వడంతో ఏం చేయాలో పాలుపోక నానా ఇబ్బందులు పడుతున్నట్లుగా అనిపిస్తుంది.