హాటు చీరలో న్యాచురల్ బ్యూటీ

0

హిందీ సినిమా ప్రియులకు భూమి పెడ్నేకర్ పేరు తెలిసే ఉంటుంది. ‘టాయిలెట్: ఎక్ ప్రేమ్ కథా’.. ‘దమ్ లగాకే హైషా’.. ‘శుభ్ మంగళ్ సావధాన్’.. ‘సొన్ చిడియా’ చిత్రాల్లో నటించి మంచి గుర్తింపే సాధించింది. ప్రస్తుతం బాలీవుడ్ లో ఉన్న బిజీ భామల్లో భూమి ఒకరు. అయితే ఎంత బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియా తాట తీయడంలో ఎంఎ కెమిస్ట్రీ చేసిందని బాలీవుడ్ లో మసాలా గుసగుసలు వినిపిస్తున్నాయి. అంత పెద్ద సదువు సదివిన తర్వాత మనసు అస్సలు ఊరుకోదు కదా..!

అందుకే ఈ భామ రీసెంట్ గా తన ఇన్స్టా ఖాతా ద్వారా కొన్ని కత్తిలాంటి ఫోటోలు పోస్ట్ చేసింది. ఈ భామ ‘పతి పత్ని ఔర్ వో’ అనే హిందీ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ సందర్భంగా ప్రముఖ డిజైనర్ మనీష్ మల్హోత్రా డిజైన్ చేసిన ఒక ఏనుగుదంతం రంగు చీరను ధరించింది. ఆ చీరలోనే ఫోటోషూట్ లో పాల్గొంది. ఈ ఫోటోలే భూమి తన ఇన్స్టా లో షేర్ చేసిన ఫోటోలు. ఇక ఈ ఫోటోలకు భూమి ఇచ్చిన క్యాప్షన్ “జస్ట్ ఎ సెక్సీ నారీ వేరింగ్ ఎ సెక్సీ సాడీ”. ఈ భాషను హింగ్లిష్ అంటారు. అంటే హిందీని ఇంగ్లీష్ ని కలిపి కొట్టడం అన్నమాట. ‘సెక్సీ చీరను ధరించిన సెక్సిణి’ అని మనం రఫ్ అనువాదం చేసుకోవచ్చు. క్యాప్షన్ లోనే సెక్సీ లేడీ సెక్సీ చిర కట్టుకుందని తనే చెప్పేసింది కదా. ఇక మనం వివరించడానికి ఏం మిగిలింది? నిజంగానే సెక్సీ గా ఉంది. మెడ మీద తల ఉన్న ఎటువంటి మగ మనిషికైనా ఆ ఫోటోలు చూస్తే జివ్వనిపించడం ఖాయం.

ఈ ఫోటోలకు సూపర్ రెస్పాన్స్ వచ్చింది. “సో సో సెక్సీ”.. ‘భూమి ఆన్ ఫైర్’.. ‘ఐస్ క్రీమ్ లా ఉన్నావు’.. ‘న్యాచురల్ బ్యూటీ’ అంటూ కొందరు తమ స్పందనలు తెలిపారు. ఇక భూమి సినిమాల విషయానికి వస్తే ‘సాంద్ కి ఆంఖ్’.. ‘భూత్- పార్ట్ 1: ది హాంటెడ్ షిప్’.. ‘బాలా’..’డాలీ కిట్టీ ఔర్ ఓ చమక్తే సితారే’ అనే చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer