నారింజ రంగు డ్రెస్సు.. నాటీ లుక్కు

0

హీరోయిన్లు చాలామందే ఉంటారు. హిట్లు కూడా సాధిస్తారు. కానీ క్రేజీ బ్యూటీలు మాత్రం కొంతమందే ఉంటారు. అలాంటివారిలో కియారా అద్వాని ఒకరు. మొదటి నుంచి కియారా నటించిన సినిమాలు హిట్లు అవుతూనే ఉన్నాయి. అయితే లస్ట్ సీరీస్ తో ఒక్కసారిగా కియారా పేరు మోతమోగిపోయింది. ఈమధ్యేమో ‘కబీర్ సింగ్’ ఘన విజయం సాధించింది. దీంతో కియారా క్రేజ్ ఆకాశాన్ని టచ్ చేసింది. ఈ భామ సోషల్ మీడియాను ఆడుకోవడంలో స్పెషలిస్టు.

హాట్ ఫోటోషూట్లు చెయ్యడమే కాదు. సూపర్ స్టైలిష్ డ్రెస్సులతో నెటిజన్ల మతులు పొగొడుతూ ఉంటుంది. సందర్భానికి తగ్గట్టు దుస్తులు ధరించే ఈ భామ రీసెంట్ గా ఒక ఫోటో షూట్లో డీప్ వీ నెక్ ఉండే నారింజ రంగు గౌన్ ధరించింది. దీనిపైన బటన్స్ పెట్టుకోకుండా ఒక డెనిమ్ జాకెట్ వేసుకుంది. మెడలో మూడు వరుసలు ఉండే బంగారు గొలుసు.. దానికి K అనే ఇంగ్లీష్ అక్షరం ఉండే లాకెట్ వేసుకొని భలేగా పోజిచ్చింది. మరి ఆ కె అక్షరానికి అర్థం కియారా అనేనా లేకా ఎవరైనా బాలీవుడ్ హీరో పేరును షార్ట్ గా పెట్టుకుందా అనేది తెలియదు.

ఏదైతేనేం ఈ ఫోటో నెటిజన్లకు తెగ నచ్చింది. అందుకే వైరల్ గా మారింది. ఇక కియారా సినిమాల విషయానికి వస్తే చేతిలో నాలుగు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ‘గుడ్ న్యూస్’.. ‘లక్ష్మి బాంబ్’.. ‘షేర్ షా’.. ‘ఇందూ కీ జవాని’ సినిమాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer