న‌వీన్ చంద్ర‌ `నేను లేని నా ప్రేమ‌క‌థ‌`!

0

`అందాల రాక్ష‌సి` సినిమాతో హీరోగా విభిన్న‌మైన చిత్రాల క‌థా నాయ‌కుడిగా పేరుతెచ్చుకున్నారు న‌వీన్‌చంద్ర‌. ఇటీవ‌ల అడివి శేష్ న‌టించిన `ఎవ‌రు` చిత్రంలో కొత్త త‌ర‌హా పాత్ర‌లో న‌టించి ఆక‌ట్టుకున‌న ఆయ‌న తాజాగా మ‌రో విభిన్న‌మైన చిత్రంలో న‌టిస్తున్నారు. న‌వీన్‌చంద్ర న‌టిస్తున్న తాజా చిత్రం `నేను లేని నా ప్రేమ‌క‌థ‌`. ఎమ్‌.ఎస్‌. సుబ్బ‌ల‌క్ష్మి స‌మ‌ర్ప‌ణ‌లో త్రిషాల ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై క‌ల్యాణ్ కందుకూరి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

సురేష్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్నారు. సోమ‌వారం ఈ చిత్రానికి `నేను లేని నా ప్రేమ‌క‌థ‌` అనే టైటిల్‌ని చిత్ర బృందం ఖ‌రారు చేసింది. ఇందులో న‌వీన్‌చంద్ర‌కు జోడీగా గాయ‌త్రీ సురేష్ న‌టిస్తున్నారు. క్రిష్ సిద్ధిపెల్లి, అదితి మ‌రో జంట‌గా న‌టిస్తున్నారు. ఓ ఫ్రెష్ ల‌వ్‌స్టోరీతో రూపొందుతున్న చిత్ర‌మిద‌ని, సినిమా చూసిన ఆడియ‌న్స్ కూడా ఇదే అనుభూతికి లోన‌వుతార‌ని, జువిన్ సింగ్ సంగీతం, సురేష్ టేకింగ్ ఆక‌ట్టుకుంటాయ‌ని, త్వ‌ర‌లోనే ఫ‌స్ట్ లుక్ టీజ‌ర్‌ని రిలీజ్ చేస్తామ‌ని నిర్మాత స్ప‌ష్టం చేశారు.

ప్రేమ అనేది ఓ అనిర్వ‌చ‌నీయ‌మైన భావ‌న అని దాన్ని ఎదుటి వ్య‌క్తికి తెలియ‌జేయ‌డం అంత ఈజీ కాద‌ని, అంతఃపురం, ఖ‌డ్గం చిత్రాల‌కు ఫొటోగ్ర‌ఫీని అందించిన ఎస్‌.కె.ఏ. భూప‌తి ఈ చిత్రానికి అద్భుతమైన ఫొటోగ్ర‌ఫీని అందిస్తున్నార‌ని, సినిమా త‌ప్ప‌కుండా ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకుంటుందని ద‌ర్శ‌కుడు సురేష్ వెల్ల‌డించారు.
Please Read Disclaimer