ట్యాలెంట్ తో పాటు దమ్మున్న నటుడు

0

అందాల రాక్షసి చిత్రంతో పరిచయం అయిన నవీన్ చంద్ర మొదటి సినిమాతోనే అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ సినిమాలో మెయిన్ హీరో అయిన రాహుల్ రవీంద్రన్ కంటే కూడా అధికంగా నవీన్ చంద్ర గురించి మాట్లాడుకున్నారు. ఆ సినిమాలో నవీన్ నటన చాలా బాగుంది అంటూ ప్రశంసలు దక్కించుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో హీరోగా నటించాడు. అయితే లక్ కలిసి రాకపోవడంతో సక్సెస్ లు దక్కలేదు. కేవలం హీరో పాత్రల కోసమే ఎదురు చూడకుండా క్యారెక్టర్ ఆర్టిస్టుగా కూడా చేయడం మొదలు పెట్టాడు.

అరవింద సమేత చిత్రంలో విలన్ గా నటించి నటుడిగా మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. త్రివిక్రమ్ ఆ చిత్రంలో బాల్ రెడ్డి అనే ఒక మంచి పాత్రను ఇవ్వడంతో నవీన్ చంద్ర కెరీర్ టర్న్ అయ్యింది. అరవింద సమేత చిత్రం తర్వాత మళ్లీ బిజీ అయిన నవీన్ చంద్ర ప్రస్తుతం తమిళంలో ధనుష్ హీరోగా తెరకెక్కుతున్న ‘పటాస్’ చిత్రంలో మెయిన్ విలన్ గా నటించాడు. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఆ సినిమా ట్రైలర్ తాజాగా వచ్చింది. అయిదు పదుల వయసు వ్యక్తి పాత్రలో నవీన్ చంద్ర కనిపిస్తున్నాడు.

చిన్న వయసులోనే అలాంటి పాత్రలు చేసేందుకు ఘట్స్ ఉండాలి. విలన్ గా అది కూడా ముదురు వయసు వ్యక్తిగా కనిపిస్తూ ఎక్స్ ప్రెషన్స్ ఇవ్వడం అంటే మాటలు కాదు. పటాస్ లో నవీన్ చంద్ర తండ్రిగా చేసిన పాత్రతో అక్కడ కూడా బిజీ అవ్వడం ఖాయం అనిపిస్తుంది. ప్రతిభ మరియు దమ్మున్న నటుడు అయినందు వల్ల నవీన్ చంద్ర భవిష్యత్తులో మరిన్ని మంచి పాత్రలు చేయడం ఖాయం అంటున్నారు.
Please Read Disclaimer