ధనుష్ తో ఫైట్ కు టాలీవుడ్ యంగ్ హీరో సై!

0

‘అందాల రాక్షసి’ ఫేమ్ నవీన్ చంద్ర హీరోగానే నటిస్తానని మడి కట్టుకు కూర్చోకుండా ఒకవైపు హీరోగా నటిస్తూనే విలన్ రోల్స్ చేస్తున్నాడు. తనకు లభించిన పాత్రల్లో విషయం ఉంటే వాటిని ఒప్పుకుంటూ నటుడిగా తన సత్తా చాటుతున్నాడు. ఈమధ్య ‘దేవదాస్’ లో.. ‘అరవింద సమేత’ కూడా నవీన్ నెగటివ్ పాత్రలు చేసి ప్రేక్షకులను మెప్పించాడు. తెలుగు మాత్రమే కాదు నవీన్ కు ఇతర భాషల నుండి కూడా ఆఫర్లు వస్తున్నాయి.

తమిళ స్టార్ హీరో ధనుష్ నటించే కొత్త సినిమా ‘అసురన్’ లో నవీన్ చంద్రకు విలన్ గా అవకాశం వచ్చిందట. వెట్రిమారన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని వీ క్రియేషన్స్ బ్యానర్ పై కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. రీసెంట్ గా తన ఇన్స్టాగ్రామ్ ఖాతా లో తమిళ నాడులో షూటింగ్ కు సంబంధించిన కొన్ని ఫోటోలు పోస్ట్ చేశాడు. మరి ఆ ఫోటోలు ధనుష్ సినిమా షూటింగ్ సందర్భంగా తీసినవే అయి ఉండొచ్చని అంటున్నారు. తమిళ చిత్రాల్లో నటించడం నవీన్ కు ఇది మొదటి సారేమీ కాదు. ఇప్పటికే ఓ అరడజను సినిమాల్లో నటించాడు.

మరి ధనుష్ సినిమాతో తమిళ ఆడియన్స్ లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకుంటాడేమో వేచి చూడాలి. తెలుగు సినిమాల విషయానికి వస్తే.. నవీన్ హీరోగా నటించే ‘హీరో హీరోయిన్’.. ’28 డిగ్రీ సెల్సియస్’ సినిమాలు సెట్స్ పైన ఉన్నాయి.
Please Read Disclaimer