స్టార్ నటుడి తమ్ముడిపై మరో కేసు నమోదు

0

హిందీ విలక్షణ నటుడు నవాజుద్దీన్ సిద్దిఖీ నుండి విడాకులు కోరుతూ ఆలియా కోర్టును ఆశ్రయించిన విషయం తెల్సిందే. అదే సమయంలో నవాజుద్దీన్ తమ్ముడితో పాటు ఇతర కుటుంబ సభ్యులపై గృహ హింస కేసును పెట్టింది. ఆ కేసు విచారణలో ఉన్న సమయంలోనే నవాజుద్దీన్ తమ్ముడిపై మరో కేసు నమోదు అయ్యింది. నవాజుద్దీన్ కు కూతురు వరుస అయిన ఒక అమ్మాయి ఈ కేసు పెట్టింది. దిల్లీలోని జమీనా పోలీస్ స్టేషన్ లో ఈ ఫిర్యాదు చేసింది.

కేసు నమోదు చేసిన తర్వాత ఆమె మీడియాతో మాట్లాడుతూ.. నా చిన్నతనంలోనే అమ్మానాన్న విడిపోయారు. ఆ సమయంలో నేను నవాజుద్దీన్ పెదనాన్న ఇంటి వద్ద ఉన్నాను. నాకు 9 ఏళ్ల వయసు ఉన్నప్పుడు నవాజుద్దీన్ తమ్ముడు నాపై లైంగిక దాడి చేశాడు. అప్పుడు నాకు పెద్దగా అవగాహణ లేకపోవడంతో ఏం చేయాలో తెలియలేదు. ఒక సారి నవాజుద్దీన్ పెదనాన్నకు చెప్పాను. కాని ఆయన నన్ను అర్థం చేసుకోలేదు. అతడు నీ బాబాయి నీ పట్ల అలా ఎలా ప్రవర్తిస్తాడని అనుకుంటున్నావు. తప్పుగా అర్థం చేసుకోమాకు అంటూ నన్ను కోపడ్డాడు అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

ఆ సమయంలోనే పెదనాన్న నన్ను అర్థం చేసుకుని ఉంటే నా జీవితం బాగుండేది. నేను పెళ్లి చేసుకున్న తర్వాత కూడా నా అత్తవారింటికి చెందిన వారిని.. నా కుటుంబ సభ్యులను మానసికంగా వేదించేందుకు కేసులు పెట్టడంతో పాటు బెదిరింపులకు పాల్పడుతున్నట్లుగా ఆమె ఆరోపించింది. కేసు నమోదు చేసిన పోలీసులు నవాజుద్దీన్ సిద్దిఖీ తమ్ముడిని విచారించేందుకు సిద్దమవుతున్నారు.
Please Read Disclaimer