చిరు చరణ్ లు స్పందించాలంటున్నారు

0

గత రెండు రోజులుగా కోలీవుడ్ వాతావరణాన్ని గరం గరంగా మార్చేసిన రాధారవి ఉదంతం మెల్లగా ఓ కొలిక్కి వస్తోంది. నయనతార గురించి తాను అన్న మాటలను అపార్థం చేసుకున్నారని కావాలంటే విజ్ఞేశ్ శివన్ తో కలిపి ఇద్దరికీ వివరించి సారీ చెబుతానని రాధారవి ప్రకటించాడు. అయినా నయన్ క్యాంప్ నుంచి ఇంకా ఎలాంటి స్పందన లేదు. వారు వీరు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు దీన్ని తీవ్రంగా ఖండించారు. మన రానా కూడా బాగానే ఫైర్ అయ్యాడు.

ఈ టైంలోనే మెగాస్టార్ చిరంజీవి స్పందన కోరుతున్నారు నయన్ అభిమానులు. దానికి కారణం లేకపోలేదు. చిరు కెరీర్లోనే అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిస్తున్న సైరా నరసింహారెడ్డిలో నయనతారే మెయిన్ హీరొయిన్. ఇప్పటికే కీలక భాగం షూటింగ్ పూర్తి చేసుకుంది. బాలన్స్ పార్ట్ కూడా వచ్చే నెలలో ఫినిష్ చేసే అవకాశాలు ఉన్నాయి. అందుకే చిరు కూడా రాధారవి కామెంట్స్ ని ఖండించాలని వాళ్ళ వెర్షన్. అంతే కాదు సైరా నిర్మాతగా తన సినిమా హీరొయిన్ మీద ఇలాంటి వ్యాఖ్యలు చేసినందుకు రాధారవి గురించి రామ్ చరణ్ కూడా రెస్పాండ్ కావాలని కోరుతున్నారు.

ఇదంతా బాగానే ఉంది కాని సైరా షూటింగ్ లో బిజీగా ఉన్న చిరు అసలు ఏ లొకేషన్ లో ఉన్నారో మీడియాకే తెలియదు. మరోపక్క ఆర్ ఆర్ ఆర్ ప్రెస్ మీట్ తర్వాత ఎయిర్ పోర్ట్స్ లో తప్ప రామ్ చరణ్ బయట దొరకడం లేదు. ఈ నేపధ్యంలో నయనతార ఇష్యూ గురించి అడుగుదామన్నా ఇద్దరూ అందుబాటులో లేరు. సోషల్ మీడియా వేదికగా చెప్పుకోవచ్చు కాని చిరు చరణ్ లకు ట్విట్టర్ ఎకౌంట్స్ లేవు. సో మెగా కాంపౌండ్ నుంచి ఇంకెవరైనా బదులిస్తారేమో చూద్దాం
Please Read Disclaimer