త్వరలోనే స్టార్ హీరోయిన్ పెళ్లంటా..!

0

సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార. ప్రస్తుతం అన్నీ ఇండస్ట్రీలలో పెద్ద సినిమాల ఆఫర్లు దక్కించుకుంటూ రెమ్యూనరేషన్ కూడా భారీగానే అందుకుంటుంది. దాదాపు పన్నెండేళ్లకు పైనే సినిమాలలో అలరిస్తున్న నయన్.. కెరీర్ ప్రారంభంలో గ్లామర్ పాత్రలకే ప్రాధాన్యమిచ్చింది. గత కొన్నేళ్లుగా తన పంథా మార్చేసింది. గ్లామర్ షో కాస్త తగ్గించేసి నటనకు ప్రాధాన్యత ఉన్న సినిమాలు ఓకే చేస్తోంది. సినిమాల పరంగా టాప్ లో ఉన్నప్పటికీ వ్యక్తిగత జీవితం విషయంలో మాత్రం ఆమెకు సంతృప్తి లేదనే చెప్పాలి. ఈ మధ్య తన ప్రేమ పెళ్లి విషయాలతో వార్తలలో నిలుస్తుంది. వరుస విజయాలతో దూసుకుపోతున్న నయన్ సౌత్ ఇండస్ట్రీలో మంచిపేరు సంపాదించుకుంది. అయితే సినిమాల్లో సక్సెస్ఫుల్గా సాగుతున్నా పర్సనల్ లైఫ్ లో రెండుసార్లు విఫలం అయింది.

మొదటి లవర్ని ముందే వదిలించుకొని ప్రభుదేవాను మాత్రం పెళ్లి పీటలెక్కే ముందు వదిలేసింది. ఆ తర్వాత నయన్ లైఫ్ లోకి ఫిల్మ్ డైరెక్టర్ విఘ్నేష్ శివన్ ఎంటరయ్యాడు. ‘నానుమ్ రౌడీ దాన్’ అనే సినిమా షూటింగ్ సమయంలో వీళ్లిద్దరి మధ్య ప్రేమ చిగురించిందట. అప్పటి నుంచి హాలీడే ట్రిప్లకు వెళ్తూ తరచూ కెమెరాల కంటికి చిక్కుతూనే ఉన్నారు. ఇంతలో విఘ్నేష్తో నయన్ పెళ్లి అని జోరుగా ప్రచారం జరుగుతుంది. తాజాగా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నయనతార సంచలన నిర్ణయం తీసుకుందట. విఘ్నేష్ కుటుంబ సభ్యులు పెళ్లి గురించి ఒత్తిడి పెంచడంతో నయన్ బలవంతంగా ఓకే అన్నట్లు న్యూస్ చక్కర్లు కొడుతోంది. ఇక నయన్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కుతుందని నెట్టింట్లో హల్చల్ నడుస్తుంది. మరి ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే కొంతకాలం ఆగాల్సిందే!
Please Read Disclaimer