నెగెటివిటీ పై క్లాస్ తీస్కున్న నయన్

0

నయనతార ప్రేమ వ్యవహారం నిరంతరం సోషల్ మీడియా లో హాట్ టాపిక్. అయితే కామెంట్లపై ఏనాడూ నయన్ సీరియస్ గా తీసుకుని స్పందించలేదు. ఆ కథనాలు నెగిటివ్ గా ఉన్నా తాను పాజిటివ్ గానే తీసుకుంది. విఘ్నేష్ తో నయన్ ప్రేమ వ్యవహారం బెడిసి కొట్టింది అంటూ ప్రచారం సాగడం నయన్ ని కొంత మానసికంగా కుంగదీసిందట. అయినా ఆ ప్రచారాన్ని నయన్ లైట్ తీస్కుంది. సోషల్ మీడియాకు.. మీడియా ఇంటరాక్షన్స్ కు దూరంగా ఉండటం వల్ల నయన్ వీటిని లైట్ తీసుకుందనే భావించారంతా! తాజాగా ఓ అవార్డు వేడుకలో నెటిజనులపై నయనతార ఊహించని విధంగా చురకలు వేసింది. తనపై వ్యక్తిగతంగా చెడు రాతలు రాసేవాళ్లకు ఫుల్ గా క్లాస్ తీస్కోవడం షాక్ నిచ్చింది.

“జీవితంలో సంతోషం ఉంటే సరి పోదు. ప్రశాంతత చాలా ముఖ్యం. ఇప్పుడు చాలా ప్రశాంతంగా ఉన్నా. లైఫ్ లో హ్యాపీనెస్ అన్నది భర్త వల్ల కానీ.. భార్య వల్ల కానీ.. కాబోయే భర్త వల్ల కానీ రావొచ్చు. సోషల్ మీడియాకు ఎప్పుడు దూరంగా ఉండటం వల్ల ఇంకా ప్రశాంతంగా ఉన్నా. సోషల్ మీడియాలో నెగిటివ్ గా ఉండే ధోరణి ఎక్కువైంది. ఒకరు నచ్చితే వారి గురించి మంచి విషయాలు పోస్ట్ చేయండి. అందువల్ల అంతా సంతోషిస్తారు. లేదంటే వదిలేయండి. అంతేకానీ కించ పరుస్తూ.. అవమాన పరుస్తూ రాయడం సరికాదు. విమర్శించడం..తిట్టడం వంటింది అసలే మంచిది కాదు. అందరు సానుకూల దృక్ఫథం తో మెలగాలి. అప్పుడే అంతా సంతోషంగా ఉంటారు“ అంటూ నెటిజనులకు క్లాస్ తీస్కుంది.

అయితే ఎప్పుడూ లేనిది నయన్ ఇలా ఓ అవార్డుల వేడుకలో ఇంత ఘాటుగా క్లాస్ వేయడంతో అందర్నీ ఆశ్చర్యపరిచింది. నయన్ వ్యాఖ్యల పై ప్రస్తుతం నెటిజనులు కామెంట్లు ఆసక్తి కరంగా ఉన్నాయి. మీడియా ఇంటర్వూలు…సినిమా ప్రచారానికి దూరంగా ఉండటం వల్ల నయన్ మనసులో మాట ఇన్నాళ్లకు ఈ వేదిక ద్వారా బయటకు వచ్చిందా? అంటూ వ్యాఖ్యల్ని పోస్ట్ చేస్తున్నారు. తానొవ్వక నొప్పింపక అన్నట్టు మాట్లాడినా లైట్ గా క్లాస్ తీస్కుందిగా అంటూ కొందరు రిప్లై ఇస్తున్నారు.
Please Read Disclaimer