స్టార్ డైరెక్టర్ కు వార్నింగ్ నయన్ క్రేజ్ నిదర్శణం

0

ప్రస్తుతం కోలీవుడ్ లోనే కాకుండా సౌత్ సినీ ఇండస్ట్రీలోనే నయనతార స్టార్ హీరోయిన్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. అత్యధిక పారితోషికం తీసుకునే ముద్దుగుమ్మల్లో మొదటి వరుసలో ఉండటంతో పాటు అత్యధిక సినిమాల్లో ఈ అమ్మడు నటిస్తోంది. లేడీ సూపర్ స్టార్ అంటూ కూడా ఈమెకు అభిమానులు బిరుదు ఇచ్చేశారు. అంతటి స్టార్ డం ఉన్న నయన్ ప్రస్తుతం సూపర్ స్టార్ రజినీకాంత్ తో ‘దర్బార్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.

దర్బార్ చిత్రాన్ని ప్రముఖ స్టార్ డైరెక్టర్ మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంను అతి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇక ఈ చిత్ర దర్శకుడు మురుగదాస్ తో గతంలో నయనతార విభేదించింది. గజిని చిత్రంలో ముఖ్య పాత్రకు అంటూ తీసుకున్నారు. కథ చెప్పిన సమయంలో చాలా చెప్పారు. కాని తీరా సినిమాలో మాత్రం తన పాత్రను చాలా తగ్గించడంతో పాటు అసలు ప్రాముఖ్యత లేకుండా తీశారంటూ అప్పట్లో నయనతార కామెంట్స్ చేసింది.

గజిని విషయంలో జరిగినట్లుగా మళ్లీ జరగదని హామీ ఇచ్చిన తర్వాతే దర్బార్ చిత్రంలో నటించేందుకు నయనతార ఓకే చెప్పింది అంటూ తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి. కథలో చెప్పిన విధంగానే తన సీన్స్ ఉండాలని.. ఫైనల్ ఎడిట్ లో కూడా తన సీన్స్ ను మొదట చెప్పినట్లుగా ఉండాలనే కండీషన్ తో నయనతార ఈ చిత్రంలో నటించినట్లుగా ప్రచారం జరుగుతోంది. ఒక వేళ మళ్లీ ఏమైనా తేడా జరిగితే సినిమా విడుదలనే అడ్డుకుంటానంటూ సున్నితంగా మురుగదాస్ కు నయన్ వార్నింగ్ కూడా ఇచ్చిందని తమిళ సినీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

తమిళంలోనే కాకుండా ఇండియా వ్యాప్తంగా కూడా స్టార్ స్టేటస్ ను కలిగి ఉన్న దర్శకుడు మురుగ దాస్ కే సున్నితంగా నయన్ వార్నింగ్ ఇచ్చిందంటే ప్రస్తుతం ఆమె క్రేజ్ ఏ రేంజ్ లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు అంటూ నయన్ అభిమానులు సోషల్ మీడియాలో చర్చించుకుంటున్నారు.